For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: అతని కోసం నా ప్రాణాలిస్తా - గంభీర్

కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఫ్రాంచైజీతో తనకు ఉన్న అనుబంధాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వివరించాడు. 2011‌‌లో కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గంభీర్ తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిపాడు. కేకేఆర్‌ను తాను విజయపథంలో నడిపించలేదని, కోల్‌కతా జట్టే తనని ఓ విజయవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దిందని గంభీర్ పేర్కొన్నాడు.

ఇటీవల కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా పనిచేశాడు. లక్నో జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. కానీ, గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలానికి ముందే లక్నో ఫ్రాంచైజీని గంభీర్ వదిలిపెట్టాడు. తిరిగి కేకేఆర్ గూటికి చేరాడు. కెప్టెన్‌గా కోల్‌కతా‌కు గంభీర్ రెండు సార్లు టైటిల్ అందించాడు. 2012, 2014 సీజన్లలో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఈ సీజన్‌లోనూ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

IPL 2024 I can take a bullet for him- Gautam Gambhir

అయితే నిస్వార్థం గురించి మాట్లాడుతూ గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. కేకేఆర్ మాజీ క్రికెటర్, డచ్ బ్యాటర్ ర్యాన్‌టెన్ డొస్చెట్‌ను కొనియాడాడు. ర్యాన్‌టెన్ కోసం తూటాకి అయినా ఎదురు నిలబడతానని గంభీర్ అన్నాడు.
'' నా 42 ఏళ్ల జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ర్యాన్‌టెన్ గ్రేటెస్ట్ టీమ్ ప్లేయర్. నిస్వార్థం లేని గొప్ప వ్యక్తి. అతడి కోసం బుల్లెట్‌కు అయినా ఎదురువెళ్తా. జీవితాంతం అతడిని నమ్మవచ్చు. 2011లో కేకేర్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడినప్పుడే ఈ విషయం అర్థమైంది''

''మేం నలుగురు విదేశీ ప్లేయర్లతోనే బరిలోకి దిగాలి. ర్యాన్‌టెన్‌కు వన్డే వరల్డ్ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ ఆ సందర్భంలో అతడిని తుదిజట్టులో తీసుకోలేదు. మ్యాచ్‌కు మేం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే వెళ్లాం. అతడు తన ముఖంలో ఎలాంటి బాధ లేదు. జట్టు కోసం నవ్వుతూ డ్రింక్స్ అందించాడు. నిస్వార్థం గురించి నాకు ర్యాన్‌టెన్ నేర్పించాడు. ఈ ఆటగాళ్లే నన్ను నాయకుడిని చేశారు'' అని గంభీర్ పేర్కొన్నాడు.

2011లో ఐపీఎల్‌‌లో కేకేఆర్ తరఫున ర్యాన్‌టెన్ అరంగేట్రం చేశాడు.ఆ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లే ఆడిన అతడు 146 స్ట్రైక్ రేటుతో 107 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో మొత్తంగా 29 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 23న కోల్‌కతా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

Story first published: Wednesday, March 20, 2024, 16:40 [IST]
Other articles published on Mar 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+