Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌‌ను కూడా

Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్‌‌ టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకూ బోణీ చేయలేదు. ఆడిన రెండింట్లోనూ తన ప్రత్యర్థుల చేతిలో చిత్తయింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టని జట్లు ఏవైనా ఉన్నాయా అంటే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్సే.

లక్నో సూపర్ జెయింట్స్ మాటెలా ఉన్నప్పటికీ.. ముంబై ఇండియన్స్ వరుస ఓటములు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రెండు మ్యాచ్‌లల్లోనూ పరాజయాలను చవి చూడటం ఆ జట్టు కాన్ఫిడెంట్‌ను దెబ్బ తీసినట్టయింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై, రెండో గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పోరాడి ఓడింది ముంబై. గెలుపు అంచుల వరకూ వెళ్లింది. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది.

IPL 2024 Hardik Pandya s wife Natasa gets trolls after Mumbai Indians poor show

ప్రత్యేకించి- సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్.. ముంబై ఇండియన్స్ పోరాట స్ఫూర్తికి అద్దం పట్టింది. ఆరెంజ్ ఆర్మీ నిర్దేశించిన 277 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ మాత్రం వెన్ను చూపలేదు. జట్టు స్కోరును 246 పరుగుల వరకూ తీసుకెళ్లింది. ఒక దశలో గెలిచే స్థితిలో కనిపించింది కూడా.

ఈ ఓటముల దెబ్బకు కేప్టెన్ హార్దిక్ పాండ్యా మీమర్స్‌, హేటర్స్‌కు టార్గెట్ అయ్యాడు. విచ్చలవిడిగా అతన్ని ట్రోల్ చేశారు మీమర్స్. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కేప్టెన్సీని అప్పగించడమే దీనికి కారణమని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రోహిత్ శర్మను అభిమానించే వాళ్లంతా పాండ్యాను ట్రోల్ చేయడం ద్వారా తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు.

అక్కడితో ఆగలేదు హేటర్స్. చివరికి పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్‌పైనా మీమ్స్ పెట్టడం, ఆమెపై కామెంట్స్ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. భార్య వల్లే అతను మ్యాచ్‌పై కాన్సన్‌ట్రేట్ చేయట్లేదంటూ విమర్శలు గుప్పిస్తోన్నారు. పాండ్యా ఫెయిల్యూర్స్ వెనుక నటాషా ఎఫెక్ట్ ఉందంటూ మండిపడుతున్నారు.

Story first published: Friday, March 29, 2024, 10:04 [IST]
Other articles published on Mar 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+