Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ తప్పులేదు..ఇక ఆపేయండి- పొలార్డ్

ఐపీఎల్ 17వ సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ఆరంభించింది.2013 నుంచి తొలి మ్యాచ్‌‌లో ఓటమిపాలవ్వడం ముంబైకు ఓ ఆనవాయితీగా మారింది. యాదృచ్చికంగా 2012 నుంచి ఇప్పటివరకు లీగ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఒక్కసారి విజయం సాధించలేకపోవడం గమనార్హం.

అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమికి కెప్టెన్ హార్దిక్ పాండ్య కారణమని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సారథిగా పేలవమైన వ్యహాలు, స్వార్థంతో హార్దిక్ ఆడాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పవర్‌ప్లేలో హార్దిక్ రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం, రషీద్ ఖాన్‌కు బయపడి బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో స్థానంలో వచ్చాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సహా అభిమానులు విమర్శించారు.

IPL 2024 Hardik Pandya is not wrong Stop it- Pollard

దీనిపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. హార్దిక్‌కు మద్దతు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టిమ్ డేవిడ్ తర్వాత హార్దిక్ బ్యాటింగ్‌కు రావడం గురించి పొలార్డ్ మాట్లాడుతూ.. ''అది హార్దిక్ ఏకపక్ష నిర్ణయమని చెప్పలేం. జట్టుగా మాకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి. మా బ్యాటర్ల గురించి ఓ ప్లాన్ ఉంటుంది. టాప్ ఆర్డర్ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత, అలాగే హిట్టర్లకు మ్యాచ్ ముగించే విధులు ఉంటాయి. గత కొంతకాలంగా ముంబైకు టిమ్ డేవిడ్ ఫినిషర్‌గా ఉన్నాడు. మరోవైపు గత కొన్నేళ్లుగా హార్దిక్ అదే పని చేస్తున్నాడు. వాళ్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడతారు''

''ఆ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోలేదు. ముందుగా ఎవరు వెళ్లాలని చర్చించి ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. జట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి 'హార్దిక్ నిర్ణయం తీసుకున్నాడు. హార్దిక్ ఇలా చేశాడు, అలా చేశాడు' అని అనడం ఆపేయండి. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున హార్దిక్ కొత్త బంతితో పవర్‌ప్లే మంచిగానే బౌలింగ్ చేశాడు'' అని పొలార్డ్ పేర్కొన్నాడు.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. ఆరో స్థానంలో వచ్చిన డేవిడ్ 11 బంతుల్లో 10 పరుగులు, ఏడో స్థానంలో వచ్చిన హార్దిక్ 4 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యారు. యితే ఓ దశలో ముంబై విజయానికి చివరి 6 ఓవర్లలో 48 పరుగులు అవసరమయ్యాయి. ముంబై చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. కానీ ఫేవరేట్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ విజయ తీరాలకు చేరలేకపోయింది. కాగా, ఉప్పల్ వేదికగా రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

Story first published: Tuesday, March 26, 2024, 14:27 [IST]
Other articles published on Mar 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+