Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gujarat Titans: గుజరాత్ తీసుకున్న అతి చెత్త నిర్ణయం ఇదే.. టీమిండియాకు కూడా దెబ్బ?

Shubman Gill: ఐపీఎల్ మినీ వేలానికి ముందు అందరికీ షాకిచ్చిన టీం గుజరాత్ టైటాన్స్. తొలి సీజన్‌లో ట్రోఫీ అందించి, రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఆ టీం ముంబైకి ట్రేడ్ చేసేసింది. అనంతరం శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేసింది. ఈ నిర్ణయం సరైంది కాదని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే?

కుర్రాడిపై భారం..:శుభ్‌మన్ గిల్ ఇంకా చాలా యంగ్ ప్లేయర్. దానికితోడు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి ప్లేయర్‌పై కెప్టెన్సీ చాలా భారం చూపిస్తుంది. దీంతో ఆటగాడిగా అతని ఎదుగుదల కుంటుపడే అవకాశం ఉంది. ఏడాది కాలంగా భారత్ తరఫున నిలకడగా రాణిస్తున్న అతను.. కెప్టెన్సీ వల్ల తడబడితే అది కేవలం ఐపీఎల్‌కే కాదు.. టీమిండియాకు కూడా నష్టమే.

IPL 2024 Gujarat Titans decision may affect Team India too

మంచి ఆప్షన్..:గుజరాత్ వద్ద కెప్గెన్సీ కోసం మరో మంచి ఆప్షన్ ఉంది కూడా. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆ జట్టులో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచులో గాయపడిన అతను.. రీఎంట్రీలో వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడాడు. కాబట్టి ఐపీఎల్‌లో కూడా మంచి ఫామ్ కనబరుస్తాడని నమ్మొచ్చు. ఐపీఎల్‌లో కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం కేన్‌కు ఉంది. కాబట్టి కేన్‌కు కెప్టెన్సీ ఇచ్చి, గిల్‌ను వైస్ కెప్టెన్ చేసి ఉంటే.. కేన్ వద్ద గిల్ కూడా చాలా నేర్చుకునే వాడు.

సీనియర్లు ఎక్కువ..:గుజరాత్ జట్టులో గిల్ చాలా యంగ్ ప్లేయర్. అతని చుట్టూ డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. వీళ్లంతా చాలా కాలంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి సీనియర్లు ఉండటం వల్ల కుర్ర కెప్టెన్ తనపై తను నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ఈ సీనియర్లను ఉంచుకొని కెప్టెన్సీ చేయడం అతనికి పెద్ద సవాల్ అనే చెప్పాలి.

Story first published: Monday, November 27, 2023, 20:43 [IST]
Other articles published on Nov 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+