For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రషీద్ ఖాన్ X క్లాసెన్ ఫైట్: ఖాన్‌తో గేమ్స్ వద్దు! (Video)

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. రికార్డు స్కోరు సాధించి జోరు మీద ఉన్న SRHను గుజరాత్ 162 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టంగా పోరాడి ఈ స్కోరు సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్ మధ్య సాగిన ఫైట్ ఆసక్తికరంగా సాగింది. రషీద్ ఖాన్ వేసిన మూడు బంతులను ఎదుర్కొన్న క్లాసెన్ మూడు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్లాసెన్‌ను అద్భుత బంతితో రషీద్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. వికెట్ కోల్పోయిన అనంతరం క్లాసెన్ ఆవేశంగా మైదానాన్ని వీడాడు. కోపంతో తన బ్యాటుకు చేతితో పంచ్‌ విసిరాడు.

IPL 2024 GT vs SRH Rashid Khan vs Heinrich Klaasen Fight Video goes viral

అంతకుముందు ఓవర్‌లోనే క్లాసెన్ ఊపు అందుకున్నాడు. నూర్ అహ్మద్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత రషీద్-క్లాసెన్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని భావించారంతా. కానీ ఈ పోరులో క్లాసెన్‌పై రషీద్ పైచేయి సాధించాడు. రషీద్ ఖాన్ ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. సూపర్ డైవ్ చేస్తూ మార్క్‌రమ్ క్యాచ్‌ను అందుకున్నాడు. సుందర్ ఆడిన భారీ షాట్‌ను కూడా క్యాచ్ పట్టి తమ మాజీ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు.

కాగా, ఈ మ్యాచ్‌ను 'సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ మాజీ సన్‌రైజర్స్ హైదరాబాద్' మ్యాచ్ అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్ SRHకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ వదులుకోవడంతో వాళ్లంతా గుజరాత్ టైటాన్స్‌‌కు వెళ్లారు. ప్రస్తుత మ్యాచ్‌లో విలియమ్సన్ మినహా మిగిలినందరూ తుదిజట్టులో ఉన్నారు. కాగా, క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఓ బౌండరీ, రెండు సిక్సర్లు బాదాడు.

Story first published: Sunday, March 31, 2024, 18:12 [IST]
Other articles published on Mar 31, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+