Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs SRH: మిల్లర్ మెరుపులు.. సన్‌రైజర్స్‌పై గుజరాత్ విజయం

గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ (45; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ మిల్లర్ (44*; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఛేదనలో సత్తాచాటారు.

బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించిన ఈ స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (29; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. మోహిత్ శర్మ (3/25) మూడు వికెట్లతో మెరిశాడు. అనంతరం ఛేదనకు దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

IPL 2024 GT vs SRH Gujarat Titans defeated Sunrisers Hyderabad by seven wickets

గుజరాత్ ఛేదనను వృద్ధిమాన్ సాహా (25; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆరంభించాడు. కానీ సాహా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో కమిన్స్ చేతికి చిక్కాడు. అనంతరం సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (36; 28 బంతుల్లో) నిలకడగా ఆడటంతో గుజరాత్ పవర్‌ప్లేలో 52 పరుగులు చేసింది.

ఆ తర్వాత SRH బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్‌ను 12 ఓవర్లకు 90/2 స్కోరుకు కట్టడి చేశారు.కానీ బ్రేక్ అనంతరం సాయి సుదర్శన్ గేర్ మార్చాడు. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్ కూడా చెలరేగడంతో లక్ష్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. చివరి 5 ఓవర్లకు 49 పరుగులు అవసరమవ్వా.. మార్కండే వేసిన 16వ ఓవర్‌లో మిల్లర్ రెండు ఫోర్లు, సాయి సుదర్శన్ ఓ సిక్సర్ బాది 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వైపు మళ్లింది. సుదర్శన్ ఔటైనప్పటికీ విజయ్ శంకర్ (14*; 11 బంతుల్లో)తో కలిసి మిల్లర్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు శుభారంభం లభించలేదు. మయాంక్ అగర్వాల్ (16; 17 బంతుల్లో, 2 ఫోర్లు) మరోసారి నిరాశపరిచాడు. అజ్మతుల్లా బౌలింగ్‌లో దర్మన్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (19; 14 బంతుల్లో, 3 ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ అభిషేక్ శర్మ (29; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో సన్‌రైజర్స్ పవర్‌ప్లేలో 56 పరుగులు చేసింది.

రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్ వరుసగా రెండు సిక్సర్లు సాధించాడు. కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లు పుంజుకున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. అభిషేక్, హెన్రిచ్ క్లాసెన్ (24; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్‌రమ్ (17; 19 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అబ్దుల్ సమద్‌తో షాబాజ్ అహ్మద్ (22; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వారిద్దరు బ్యాటు ఝుళిపించి సన్‌రైజర్స్‌కు పోరాడే స్కోరు అందించాడు.

Story first published: Sunday, March 31, 2024, 18:57 [IST]
Other articles published on Mar 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+