సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఎస్ఆర్‌హెచ్ నయా ఆల్‌రౌండర్ వానిందు హసరంగ ఇంకా జట్టుతో చేరలేదు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరగనున్న గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు హసరంగ అందుబాటలో లేడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు దూరమైన హసరంగ మరికొన్ని మ్యాచ్‌లకు కూడా దూరంకానున్నట్లు తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకున్న హసరంగను వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విన్నర్ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. కానీ, ఇటీవల బంగ్లాదేశ్ జరిగిన వన్డే సిరీస్‌లో హసరంగకు వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో అతడు శ్రీలంక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో హసరంగ గాయం గురించి లంక బోర్డు జాగ్రత్త వహిస్తుంది.

కాగా, పేసర్ నటరాజన్ కూడా గుజరాత్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమే. గాయం కారణంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు నటరాజన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన జయదేవ్ ఉనద్కత్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. మాథ్యూ వేడ్ జట్టుతో చేరాడు. ఇవాళ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు వేడ్ అందుబాటులో ఉన్నాడు. షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ కారణంగా ఈ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్, సన్‌రైజర్స్ ఒక్కో విజయంతో రెండు పాయింట్లు సాధించాయి. ఇరు జట్లూ ముంబై ఇండియన్స్‌పైనే గెలవడం విశేషం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు (అంచనా)
వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్.