Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT‌ని చూసి వణుకుతున్న టేబుల్ టాపర్ RR.. ఎందుకంటే?

ఐపీఎల్-2024 సీజన్‌లో దాదాపు మూడో వంతు ముగిసింది. పాయింట్స్ టేబుల్ టాప్‌లో రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఇవాళ సొంతమైదానంలో మరో పోరుకు ఆర్ఆర్ సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్‌‌తో రాత్రి 7.30 గంటలకు తలపడనుంది. అయితే గుజరాత్‌తో మ్యాచ్ అంటే రాజస్థాన్ శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. గతేడాది పరిస్థితి ఎక్కడ ఏర్పడుతుందనే భయపడుతోంది.

అసలేం జరిగిదంటే.. గత సీజన్‌లోనూ లీగ్ మూడో వంతు పూర్తైన టైమ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. గుజరాత్‌ను చిత్తుచేసి విజయం కూడా సాధించింది. అప్పుడూ టేబుల్ టాప్‌లోనే ఆర్ఆర్ జట్టునే ఉంది. కానీ గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కథ మారిపోయింది. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన టేబుల్ టాపర్ రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. చివరి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు చవిచూసింది.

IPL 2024 GT Match Spells Trouble for Table-Topper RR Why

మరోవైపు గుజరాత్ తర్వాత విజయాలతో హోరెత్తిస్తూ ప్లేఆఫ్స్‌కు, ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఐపీఎల్-2023 తరహాలోనే ప్రస్తుతం మూడో వంతు టోర్నమెంట్ ముగియడం, పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండటంతో అదే పరిస్థితి రిపీట్ అవుతుందేమో అని ఆర్‌ఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుత రాజస్థాన్ జట్టు ఎంతో బలోపేతంగా కనిపిస్తోంది.

కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఫామ్‌లో ఉండటం, బట్లర్ తిరిగి లయను అందుకోవడం ఆ జట్టుకు సానుకూలాంశం. యశస్వీ జైస్వాల్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్‌తో బ్యాటింగ్ లైనప్‌ స్ట్రాంగ్‌గా ఉంది. బౌలింగ్‌లోనూ ఆర్ఆర్ బలంగా కనిపిస్తోంది. చాహల్, అశ్విన్ ప్రత్యర్థిని కట్టడి చేస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్, బర్గర్ పేస్ బాధ్యతలను సమర్థవంతంగా మోస్తున్నారు. ఆర్సీబీ మ్యాచ్‌లో గాయపడిన సందీప్ శర్మ తిరిగొస్తే ఆర్‌ఆర్ బౌలింగ్ దళం మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది.

RR vs GT తుదిజట్టు అంచనా
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, బర్గర్, చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్- శుభమ్ దూబె

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, శరత్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్
ఇంపాక్ట్ ప్లేయర్- మోహిత్ శర్మ

Story first published: Wednesday, April 10, 2024, 12:52 [IST]
Other articles published on Apr 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+