స్టార్ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురై క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత నడవడానికే కష్టపడిన పంత్ ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించినట్టుగా సంకేతాలు పంపుతున్నాడు.ఇటీవల బెంగళూరులోని ఎన్సీఏలో త్రో స్పెషలిస్టులతో నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేశాడు. దీంతో ఐపీఎల్‌తో అతడి రీఎంట్రీ దాదాపు ఖరారైనట్లుగా భావిస్తున్నారంతా.
అయితే రిషభ్ పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటాడని కచ్చితంగా నమ్ముతున్నామని పాంటింగ్ చెప్పాడు. కానీ వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్‌కు అప్పగించే విషయంపై స్పష్టత లేదని చెప్పాడు. అలాగే కెప్టెన్సీ విషయంలోనూ క్లారిటీ లేదని అన్నాడు. ఐపీఎల్‌లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌కు అతడు దూరమవ్వడంతో డేవిడ్ వార్నర్ సారథి బాధ్యతలు అందుకున్నాడు.

''రిషభ్ పంత్ ఆడతాడని నమ్మకంతో ఉన్నాం. అయితే అతడు ఏ సామర్థ్యంతో బరిలోకి దిగుతాడనే విషయం చెప్పలేం. సోషల్ మీడియాలో అతడిని చూసి ఉంటారు. పంత్ బాగానే ఉన్నాడు. గొప్పగా పరిగెత్తుతున్నాడు. అయితే మేం తొలి మ్యాచ్‌కు మరో ఆరు వారాల దూరంలో ఉన్నాం. కాబట్టి ఈ సీజన్‌లో అతడు వికెట్ కీపింగ్ చేస్తాడని చెప్పలేం. ఈ విషయం గురించి అతడిని నేను అడగాల్సి వస్తే.. ప్రతి మ్యాచ్ ఆడతానని, వికెట్ కీపింగ్ చేస్తానని, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని పంత్ కచ్చితంగా చెబుతాడు''
''పంత్ డైనమిక్ ప్లేయర్, మా కెప్టెన్, గత సీజన్‌లో అతడిని చాలా మిస్ అయ్యాం. గత 12-13 నెలలు అతడి ప్రయాణం కష్టంగా సాగింది. అదృష్టవశాత్తు తీవ్ర ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బతికాడు. తిరిగి క్రికెట్ ఆడటానికి సిద్ధమయ్యాడు.అతడు 14 మ్యాచ్‌లు ఆడనప్పటికీ 10 మ్యాచ్‌లు ఆడిన మాకు ప్రయోజనకరంగానే ఉంటుంది'' అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఒకవేళ పంత్ కెప్టెన్సీని నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే వార్నర్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటాడని పాంటింగ్ చెప్పాడు.
కాగా, జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించేలా పంత్ ఫిట్‌నెస్ సాధిస్తే వరల్డ్ కప్‌లో సులువుగా చోటు సంపాదిస్తాడు. కేవలం బ్యాటర్‌గానే మెగాటోర్నీకి తీసుకోవాలంటే పంత్ విపరీతమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంత్ రీఎంట్రీ ఇవ్వడం గుడ్ న్యూస్ అని, కానీ తిరిగి గ్లవ్స్ బాధ్యతలు అందుకోవడంపై స్పష్టత లేకపోవడం బ్యాడ్ న్యూసే అని పంత్ అభిమానులు అంటున్నారు.