For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా చేస్తే.. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ ఢమాల్

CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ జట్లు పోటీ పడనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్ కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ వరకూ సీఎస్‌కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

IPL 2024 Get Virat Kohli wicket inside the Power play Matthew Hayden advise to the CSK

ఐపీఎల్‌తో పాటే దానిపై అంచనాలు కూడా మొదలయ్యాయి. ఈ సీజన్‌లో ఏ జట్టు గెలుస్తుంది?, ఏ టీమ్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది?, అత్యధిక పాయింట్లు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి?, ఏ జట్టు నాసిరకంగా ఆడుతుంది.. అట్టడుగు స్థాయికి పడిపోతుంది?.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై క్రికెటర్ లెజెండర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి చెన్నై సూపర్ కింగ్స్ కష్టపడక తప్పదని అంచనా వేశాడు ఆస్ట్రేలియన్ లెజెండరీ బ్యాటర్ మాథ్యూ హెడెన్. సీఎస్‌కేతో పోల్చుకుంటే రాయల్ ఛాలెంజర్స్ జట్టుకే అధికంగా విజయావకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ప్రత్యేకించి- విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ అయిందని అన్నాడు.

IPL 2024 Get Virat Kohli wicket inside the Power play Matthew Hayden advise to the CSK

విరాట్ కోహ్లీకి చెపాక్ పిచ్‌ బాగా అచ్చొచ్చిందని, ఇక్కడ స్ట్రైక్ రేట్ 111గా ఉందని గుర్తు చేశాడు హెడెన్. అతని బ్యాటింగ్ యావరేజ్ 30కి పైగా ఉందని పేర్కొన్నాడు. చెపాక్ పిచ్‌పై భారీ షాట్లు ఆడటం ఓపెనర్లకు ఛాలెంజింగ్‌తో కూడుకుని ఉంటుందని, టెన్నిస్ బాల్ లాగా బంతి బౌన్స్ అవుతుంటుందని వ్యాఖ్యానించాడు.

ఇలాంటి పిచ్‌పై విరాట్ కోహ్లీ బౌలర్లకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంటాడని హెడెన్ పేర్కొన్నాడు. అతన్ని అడ్డుకుంటేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోర్‌ చేయకుండా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కళ్లెం వేయగలుగుతారని అన్నాడు. 20 ఓవర్ల పాటు ఆడాలని విరాట్ డిసైడ్ అయ్యాడంటే అతన్ని అవుట్ చేయడం కష్టమని పేర్కొన్నాడు.

పవర్ ప్లే ముగిసే సమయానికే కోహ్లీని అవుట్ చేయగలిగితేనే ఆర్సీబీని ఓడించవచ్చని చెప్పాడు. చివరి అయిదు మ్యాచ్‌లల్లో విరాట్ కోహ్లీ మూడుసార్లు పవర్ ప్లేలోపే అవుట్ అయ్యాడని గుర్తు చేశాడు. దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగించాల్సి ఉంటుందని, కోహ్లీని అవుట్ చేయగలిగితే ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింటుందని వ్యాఖ్యానించాడు.

Story first published: Friday, March 22, 2024, 12:54 [IST]
Other articles published on Mar 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+