For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: ఫస్ట్ వీక్ హిట్టో హిట్.. గొడవలే హైలైట్ (Videos)

ఐపీఎల్-2024 ప్రారంభమై వారం రోజులు దాటింది. అంచనాలకు మించి అభిమానులను లీగ్ అలరిస్తోంది. హోరాహోరీ పోరులు, ఎగిరిపడే వికెట్లు, కళ్లు చెదిరే భారీ సిక్సర్లు, సంచనల రికార్డులతో ఐపీఎల్ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. ప్రతి సీజన్‌లో ఇవన్నీ కామనే. కానీ ఈ సీజన్‌లో మరో ప్రత్యేకత.. ఆటగాళ్ల మధ్య గొడవలు, కెప్టెన్సీ మార్పుల వివాదాలు, ఫన్నీ సంఘటనలు. ఈ వారంలో జరిగిన ఆసక్తికర ఘటనలు మీ కోసం..

హార్దిక్: ఇక వదిలేయండ్రా బాబు..
ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్‌ హార్దిక్ పాండ్యకు ఈ వారం చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ శర్మ‌కు బదులుగా ముంబై పగ్గాలు చేపట్టిన అతనికి ప్రేక్షకుల నుంచి మద్దతు లభించట్లేదు, తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అహ్మదాబాద్, ఉప్పల్ స్టేడియంలో హార్దిక్‌ టాస్‌, బ్యాటింగ్, బౌలింగ్‌, బౌండరీ లైన్ వద్ ఫీల్డింగ్‌కు వచ్చిన సందర్భాల్లో రోహిత్ నినాదాలతో మైదానం మార్మోగింది. వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉన్న హార్దిక్‌కు రోహిత్ ఫ్యాన్స్ మరో సవాలుగా మారారు.

IPL 2024 First week of IPL super hit Controversies are the highlight

ధోనీ: నన్ను అడగొద్దు.. కెప్టెన్ నేను కాదు
ఈ వారంలో జరిగిన ఐపీఎల్ సంఘటనలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిలో ధోనీకి సంబంధించిన వీడియో స్పెషల్‌గా నిలిచింది. సీఎస్‌కే‌కు కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వచ్చినా మైదానంలో జట్టులోని ఆటగాళ్లకు ఆ విషయం గుర్తు ఉండట్లేదు. అలవాటులో పొరపాటుగా ప్రతిసారీ ధోనీ వైపే చూస్తున్నారు. రివ్యూ తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని ఓ బౌలర్ ధోనీని అడగ్గా.. 'కెప్టెన్ నేను కాదు, కొత్త కెప్టెన్ని అడగండి' అంటూ ధోనీ సింబాలిక్‌గా చెప్పిన వీడియో ఇంటర్నెట్‌ను ఊపేసింది.

మయాంక్‌‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన హర్షిత్
కేకేఆర్-ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో జరిగిన మయాంక్ అగర్వాల్, హర్షిత్ రాణా గొడవ ఈ వారానికి హైలైట్‌గా చెప్పొచ్చు. మయాంక్‌ను ఔట్ చేసిన తర్వాత హర్షిత్ అతిగా ప్రవర్తించాడు. మయాంక్ దగ్గరగా వచ్చి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తూ హర్షిత్‌పై జరిమానా విధించింది. అయితే మయాంక్-హర్షిత్ ఫైట్‌ను ఈ సీజన్‌లో మరోసారి చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఒకే గ్రూప్‌లో ఈ రెండు జట్లు ఉండటంతో లీగ్ స్టేజ్‌లో ఒక్కసారి మాత్రమే ఆడనుంది. అయితే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే మరోసారి ఈ ఏడాది ఈ జట్లు తలపడే అవకాశం ఉంటుంది.

కన్ఫ్యూజ్ అయిన కొత్త కెప్టెన్
గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. టాస్ గెలిచిన గిల్ తొలుత బ్యాటింగ్ అని చెప్పాడు, కానీ వెంటనే కాదుకాదు అంటూ.. బౌలింగ్ అని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ కాస్త కంగారుపడిన ఈ సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది.

IPL 2024 First week of IPL super hit Controversies are the highlight

కలిసిపోయిన కోహ్లి-గంభీర్
గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌‌కు గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో కోహ్లితో తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా వచ్చిన గంభీర్‌తో కోహ్లి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కానీ గొడవకు వారిద్దరు ముగింపు పలికి ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు.

Story first published: Saturday, March 30, 2024, 17:31 [IST]
Other articles published on Mar 30, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+