Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Final: థ్యాంక్స్ SRH.. అదే మాకు కలిసొచ్చింది- శ్రేయస్

ఐపీఎల్-2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2012, 2014 సీజన్‌లోనూ విజేతగా నిలిచిన కోల్‌కతాకు ఇది మూడో టైటిల్. అయితే ఈ సీజన్ హోరాహోరీగా సాగినా తుదిపోరు మాత్రం చప్పగా ముగిసింది. టైటిల్ పోరు ఏకపక్షంగా సాగింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.కెప్టెన్ కమిన్స్ (24; 19 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/19) మూడు, స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (52; 26 బంతుల్లో, 4x4, 3x6) అజేయ అర్ధశతకం సాధించాడు.

Shreyas said that luckily they bowled first and everything came together

కాగా, ఫైనల్ ముగిసిన అనంతరం కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. సంతోషంతో తనకి మాటలు రావట్లేదని, సమష్టి పోరాటంతో టైటిల్ సాధించామని అన్నాడు. సీజన్ మొత్తం అజేయులుగా సత్తాచాటామని తెలిపాడు. స్టార్క్, రసెల్ విజయంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నాడు. కీలక పోరులో, ఒత్తిడి సమయాల్లో స్టార్క్ గొప్ప ప్రదర్శన చేశాడని, యువ ఆటగాళ్లు తనని చూసి ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు.

రసెల్ తన మంత్రదండంతో వికెట్లు పడగొట్టాడని శ్రేయస్ వెల్లడించాడు. తన ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును ఆదుకున్నాడని అన్నాడు. ఇక ఈ సీజన్‌లో అసాధారణ పోరాటం చేసి ఆటను రసవత్తరంగా మార్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శ్రేయస్ థ్యాంక్స్ చెప్పాడు. అలాగే ఫైనల్‌లో అదృష్టవశాత్తు తొలుత బౌలింగ్ చేసే అవకాశం వచ్చిందని, ప్రతీది తమకు కలిసొచ్చిందని అన్నాడు. మరింత పోటీ క్రికెట్ ఆడటానికి ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాడు.

''జట్టు, ఆటగాళ్ల నుంచి మేం కోరుకున్నది ఇదే. కీలక సమయాల్లో వాళ్లంతా జట్టు కోసం నిలబడ్డారు. నా అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నా. సీజన్ మొత్తం అజేయులుగా సత్తాచాటాం. మా ప్రదర్శన దోషరహితంగా సాగింది. తొలి గేమ్ నుంచి ఆఖరి వరకు అద్భుతంగా ఆడాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఒకరినొకరికి అండగా నిలిచి పోరాడాలనుకున్నాం. అదృష్టవశాత్తు మేం తొలుత బౌలింగ్ చేశాం. ప్రతీది మాకెంతో కలిసొచ్చింది. ఈ సీజన్ మొత్తంగా అసాధారణ ప్రదర్శనతో అద్భుతంగా ఆడిన సన్‌రైజర్స్‌కు కంగ్రాట్స్. మరింత పోటీ క్రికెట్ ఆడటానికి ఎదురుచూస్తున్నాం'' అని శ్రేయస్ పేర్కొన్నాడు.

Story first published: Monday, May 27, 2024, 7:22 [IST]
Other articles published on May 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+