Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!

ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ప్లేఆఫ్స్ అశలు సజీవంగా ఉంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో, 7x4, 3x6) అర్ధశతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ (36; 25 బంతుల్లో, 2x4, 3x6), తిలక్ వర్మ (2x4, 2x6) ఫర్వాలేదనిపించారు. హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది.

IPL 2024 Fans Criticize Mumbai Indians and Suryakumar for Sportsmanship Lapse

అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో, 2x4, 7x6), శశాంక్ సింగ్ (41; 25 బంతుల్లో, 2x4, 3x6) పోరాడారు. నాలుగు ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. అయితే ముంబై ఇండియన్స్ విజయం సాధించినప్పటికీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. గెలుపు కోసం క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛంగా ప్రవర్తిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విదేశీ ఆటగాళ్లతో చేతులు కలిపి సూర్యకుమార్, తిలక్ వర్మ క్రీడాస్ఫూర్తిని మరవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిదంటే.. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌లో సూర్యకు అర్షదీప్ సింగ్ వైడ్‌యార్కర్ వేశాడు. ఆ బంతిని సూర్య బ్యాటుతో తాకలేకపోయాడు. అయితే అంపైర్ తొలుత దాన్ని వైడ్‌గా ప్రకటించలేదు. మరోవైపు ముంబై డగౌట్‌లో ఉన్న టిమ్ డేవిడ్, మార్క్ బౌచర్, పొలార్డ్ రిప్లేలో బాల్‌ను చూశారు. వెంటనే క్రీజులో ఉన్న బ్యాటర్లు సూర్య, తిలక్‌కు.. అది వైడ్ అని, రివ్యూకు వెళ్లాలని సిగ్నల్ ఇచ్చారు.అనంతరం ముంబై సూర్య రివ్యూ కోరగా థర్డ్ అంపైర్ వైడ్ అని ప్రకటించాడు. అయితే డగౌట్‌‌ను చూసి రివ్యూ కోరడంపై పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Story first published: Friday, April 19, 2024, 16:40 [IST]
Other articles published on Apr 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+