Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ కాళ్లు మొక్కిన అభిమాని..ముంబై కెప్టెన్ హ్యాపీ (Video)

హైదరాబాద్‌లో ఓ అభిమాని చూపించిన ప్రేమకు ముంబై నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫిదా అయ్యాడు. అభిమాని చేతిపై తన టాటూను చూసి ఆనందంతో మురిసిపోయాడు. ఆ ఫ్యాన్‌తో కాసేపు హార్దిక్ ముచ్చటించాడు. ఆ తర్వాత అతనితో కలిసి ఫొటోకు ఫోజులు ఇచ్చాడు.

మరోవైపు ఆ అభిమాని తన ఆరాధ్య క్రికెటర్‌ హార్దిక్ పాండ్యను చూసి సంబరపడిపోయాడు. హార్దిక్ కాళ్లు మొక్కాడు. హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ, గుజరాత్ టైటాన్స్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరకేత ఎదుర్కొంటున్న హార్దిక్‌కు ఈ సంఘటన ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

IPL 2024 Fan hug Hardik Pandya and touch his feet Video goes viral

ట్రేడింగ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌ గూటికి హార్దిక్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ డిమాండ్‌తోనే హార్దిక్ ముంబైకి వెళ్లాడని ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ జట్టు పగ్గాలు అందించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పది సీజన్లలో రోహిత్ ముంబైకు అయిదు టైటిళ్లు అందించాడని, మరో కొన్నాళ్లు రోహిత్‌ను సారథిగా కొనసాగించాల్సిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, హార్దిక్ పాండ్యను రోహిత్ అభిమానులు టార్గెట్ చేశారు. విమర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు గుజరాత్ అభిమానులు హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్నారు. గత రెండు సీజన్లలో గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ జట్టును ఓ సారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిపాడు. కానీ అనూహ్యంగా హార్దిక్ జట్టును వీడటాన్ని గుజరాత్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. హార్దిక్ టాస్‌కు వెళ్లిన సందర్భంలో, బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న సమయంలో 'రోహిత్ రోహిత్' నినాదాలతో స్టేడియం మార్మోగింది. కాగా, ఇవాళ ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, March 27, 2024, 12:00 [IST]
Other articles published on Mar 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+