Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉత్కంఠగా SRH ఆఖరి ఓవర్‌: 3 క్యాచ్‌లు మిస్.. 3 సిక్సర్లు (Video)

ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. అయితే SRH‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. 19వ ఓవర్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ ఫేవరేట్‌గానే నిలిచింది. కానీ ఆఖరి ఓవర్‌లో పేలవమైన ఫీల్డింగ్‌తో అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఏకంగా మూడు క్యాచ్‌లను మిస్ చేసింది. వాటిలో రెండింటిని ఫీల్డర్లు సిక్సర్లుగా మలచడం గమనార్హం.

పంజాబ్ విజయానికి చివరి 12 బంతుల్లో 39 పరుగులు అవసరమయ్యాయి. ఫామ్‌లో ఉన్న శాంక్ సింగ్ (46*; 25 బంతుల్లో, 6x4, 1x6), అశుతోష్ శర్మ (33*; 15 బంతుల్లో, 3x4, 2x6)ను నటరాజ్‌ను 19వ ఓవర్‌లో గొప్పగా అడ్డుకున్నాడు. పది పరుగులే ఇచ్చాడు. దీంతో పంజాబ్ గెలుపు సమీకరణం ఆఖరి ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది. విజయంపై హైదరాబాద్ అభిమానులు ధీమాగా ఉన్నారు.

IPL 2024 Dramatic SRH Last Over - 3 Missed Catches and 3 Sixes against PBKS

కానీ కట్ చేస్తే.. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతుల్లో 14 పరుగులు వచ్చాయి. మొదటి బంతిని అశుతోష్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బౌండరీలైన్‌‌లో ఉన్న నితీశ్ దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ చేతుల్లో పడిన బంతి బౌండరీ రోప్ అవతల పడి సిక్సర్‌గా మారింది. తర్వాత జయదేవ్ ఉనద్కత్ వరుసగా రెండు వైడ్‌లు వేశాడు. రెండో బంతికి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. క్యాచ్ మిస్ అయ్యి సిక్సర్‌గా మారింది. ఈ సారి నితీశ్ స్థానంలో అబ్దుల్ సమద్ ఉన్నాడు. లాంగాఫ్‌లో అబ్దుల్ బంతిని అడ్డుకోలేకపోయాడు.

ఆ తర్వాత ఉనద్కత్ 2, 2, వైడ్ ఇవ్వడంతో పంజాబ్ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. అయిదో బంతిని అశుతోష్ భారీ షాట్‌కు యత్నించాడు. ఈ సారి రాహుల్ త్రిపాఠి క్యాచ్ మిస్ చేశాడు. కానీ అది బౌండరీగా మారకపోవడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది. ఇక చివరి బంతిని శశాంక్ సింగ్ సిక్సర్ బాదడంలో ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (64; 37 బంతుల్లో, 4x4, 5x6) ఆదుకున్నాడు. అర్షదీప్ సింగ్ (4/29) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 180 పరుగులకే పరిమితమైంది.

Story first published: Wednesday, April 10, 2024, 10:05 [IST]
Other articles published on Apr 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+