Travis Head: ఐపీఎల్ 2024 సీజన్ అంచనాలకు అందట్లేదు. అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 50- ఓవర్ల ఫార్మట్ తరహాలో మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రత్యేకించి.. సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు ఆటతీరుకు హద్దులు ఉండట్లేదు. టీ20 గేమ్‌లో ఉండే హద్దులన్నింటినీ చెరిపేసింది.
శనివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ స్థాయిలో రెచ్చిపోయిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. చివరి రెండు మ్యాచ్‌లను రిపీట్ చూపించింది. ఆ రెండు మ్యాచ్‌ల హైలైట్స్‌ను చూస్తోన్నామనే ఫీలింగ్‌ను కలిగించింది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లల్లో 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్- 32 బంతుల్లో 69, అభిషేక్ శర్మ- 12 బంతుల్లో 46 పరుగులు చేశారు. మిడిలార్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి- 27 బంతుల్లో 37, షాబాజ్ అహ్మద్- 29 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్- ఈ స్కోర్‌ను అందుకోలేకపోయింది. 199 పరుగుల వద్దే దాని ప్రస్థానం నిలిచిపోయింది.
ఈ స్థాయిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించినప్పటికీ.. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీనికి కారణం లేకపోలేదు. 300లను అందుకోకపోవడమే అతని అసంతోషానికి కారణమైంది. ఈ మ్యాచ్‌లో 300 పరుగులు చేయాలని భావించామని, అది సాధ్యపడలేదని వ్యాఖ్యానించాడు హెడ్.
పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు. మిడిల్ ఓవర్లల్లో వెంటవెంటనే వికెట్లను కోల్పోవడం కొంత ఆందోళనకు గురి చేసిందని పేర్కొన్నాడు. వికెట్లు పడకపోయివుంటే ఖచ్చితంగా 300ను అందుకునే వాళ్లమని చెప్పాడు. అయినప్పటికీ- 260కి పైగా స్కోర్‌ను నమోదు చేయగలిగామని అన్నాడు.
తమ తదుపరి మ్యాచ్‌లో కూడా ఇదే ఫామ్ కొనసాగాలని తాను కోరుకుంటోన్నానని ట్రావిస్ హెడ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్‌లో అడుగు పెట్టడం, అక్కడ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రిపేర్డ్‌నెస్‌ను చూడాల్సి రావడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.