Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో..!

KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‌ అంచనాలకు అందట్లేదు. అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 50- ఓవర్ల ఫార్మట్ తరహాలో మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రత్యేకించి.. సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు ఆటతీరుకు హద్దులు ఉండట్లేదు. టీ20 గేమ్‌లో ఉండే హద్దులన్నింటినీ చెరిపేసింది. ఈ జట్టు 250కి పైగా స్కోర్‌ను నమోదు చేస్తోందంటే నమ్మశక్యం కావట్లేదు క్రికెట్ పండితులకు.

శనివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ స్థాయిలో రెచ్చిపోయిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. చివరి రెండు మ్యాచ్‌లను రిపీట్‌ చూపించింది. ఆ రెండు మ్యాచ్‌ల హైలైట్స్‌ను చూస్తోన్నామనే ఫీలింగ్‌ను కలిగించింది.

IPL 2024 DC vs SRH Pat Cummins and enjoyed Travis Head and Abhishek Sharma batting a lot

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లల్లో 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్- 32 బంతుల్లో 69, అభిషేక్ శర్మ- 12 బంతుల్లో 46 పరుగులు చేశారు. మిడిలార్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి- 27 బంతుల్లో 37, షాబాజ్ అహ్మద్- 29 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్- ఈ స్కోర్‌ను అందుకోలేకపోయింది. 199 పరుగుల వద్దే దాని ప్రస్థానం నిలిచిపోయింది. 19.1 ఓవర్లల్లో ఆలౌట్ అయిందా జట్టు. క్రీజ్‌లో ఉన్నది కొద్దిసేపే అయినా ఫస్ట్ డౌన్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్- మెక్‌గుర్క్ పిడుగులు కురిపించాడు స్టేడియంలో. 18 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ 50ని రికార్డ్ చేశాడీ యంగ్ బ్యాటర్.

ఓపెనర్లు ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ.. ఢిల్లీ కేపిటల్స్ బౌలింగ్‌ను చింపి ఆరేశారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేశారు. ఇది- ఒక్క ఐపీఎల్‌లో మాత్రమే కాదు.. టోటల్‌గా టీ20 హిస్టరీలోనే ఫస్ట్ రికార్డ్. ఏ టీ20 మ్యాచ్ తీసుకున్నా కూడా పవర్ ప్లేలో 135 పరుగులు చేసిన జట్టు మరొకటి లేదు.

వారిద్దరూ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ డగౌట్‌‌కు పట్టపగ్గాల్లేకుండా పోయింది. మ్యాచ్‌ను చూస్తోన్న ప్లేయర్లందరూ చిన్నపిల్లల్లా మారారు. చిందులు వేస్తూ కనిపించారు. వాళ్లు కొట్టే ప్రతీ భారీ షాట్‌నూ మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్క్‌రమ్ ఎంజాయ్ చేశారు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అయితే మరీ చిన్నపిల్లాడిలా మారాడు. చప్పట్లు కొడతూ కనిపించాడు.

Story first published: Sunday, April 21, 2024, 10:22 [IST]
Other articles published on Apr 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+