For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజు శాంసన్‌ను గేలి చేశాడు..!!

Sanju Samson: ఐపీఎల్ 2024 సీజన్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు చతికిల పడుతోంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఈ దశలో బోల్తా కొడుతోంది. బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచ్‌లల్లో పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో టాప్ పొజీషన్ నుంచి కిందికి దిగింది.

తన చివరి రెండు మ్యాచ్‌లల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ చేతిల్లో మట్టి కరిచింది సంజు శాంసన్ సేన. మంగళవారం రాత్రి ఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

IPL 2024 DC vs RR Delhi Capitals co owner Parth Jindal mocked Sanju Samson

ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 20 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ పోరెల్- 65, ట్రిస్టన్ స్టబ్స్- 41 రాణించడంతో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడింది గానీ.. 201 పరుగుల వద్దే నిలిచి పోయింది దాని ప్రస్థానం.

ఈ మ్యాచ్‌లో కేప్టెన్ సంజు శాంసన్ ఒంటరిపోరాటం చేశాడు. ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 86 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్- 27, శుభం దుబే- 25, జోస్ బట్లర్- 19 మినహా మరెవరూ ఆ మాత్రం చేయలేకపోయారు.

సంజు శాంసన్ అవుట్ అయిన విధానం దుమారం రేపింది. ఇన్నింగ్ 16వ ఓవర్‌ నాలుగో బంతికి అతను అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన డెలివరీని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే పొంచివున్న షై హోప్.. ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్‌ను టచ్ అయ్యాయనేది వాదన.

బంతిని అందుకున్న తరువాత బౌండరీ లైన్‌ అవతలికి తూలి పడబోయిన షై హోప్.. తమాయించుకునే క్రమంలో రోప్‌కు సమాంతరంగా మూడుసార్లు ఎగిరాడు. ఆ క్రమంలో అతని షూస్ ఎడ్జ్.. రోప్‌ను తాకిందని భావించారంతా. అంపైర్ అవుట్ ఇవ్వడంతో సంజు శాంసన్ ఆయనతో ఆర్గ్యుమెంట్స్‌కు దిగాడు. కొద్దిసేపు వాదించాడు. క్రీజ్‌ను వదలడానికి ఇష్టపడలేదు.

అంపైర్‌‌తో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వీఐపీ బాక్స్‌లో ఉన్న ఢిల్లీ కేపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్.. వివాదాస్పదంగా వ్యవహరించారు. శాంసన్ అవుట్ అయ్యాడంటూ అక్కడి నుంచి గట్టిగా కేకలు వేశాడు. అవుట్ హై అంటూ పదే పదే చెప్పాడు. తన సీటులో నుంచి లేచి నిల్చుని, సంజు శాంసన్‌ను యానిమేట్ చేయడం కనిపించింది.

అతను ఇచ్చిన ఈ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోఓనర్ స్థాయిలో ఉంటూ తన ప్రత్యర్థి జట్టు ప్లేయర్‌.. పైగా టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపికైన ఆటగాడి పట్ల అలా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజన్లు పోస్టుల పెడుతున్నారు.

Story first published: Wednesday, May 8, 2024, 11:14 [IST]
Other articles published on May 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+