For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుస అపజయాల వేళ.. ముంబై ఇండియన్స్ ఓపెనర్‌కు షాకిచ్చిన బీసీసీఐ

Ishan Kishan: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని ఎదుర్కొంది. శనివారం సాయంత్రం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. 10 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆవకాశాలకు దాదాపుగా తెర పడినట్టయింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ సునామీ ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో ఆరు సిక్సర్లు, 11 పరుగులతో 84 పరుగులు చేశాడు. అతను అందించిన ఆ మొమెంటమ్‌ను మిగిలిన ప్లేయర్లు ముందుకు తీసుకెళ్లగలిగారు.

IPL 2024 DC vs MI Ishan Kishan slapped with fine for violating IPL Code of Conduct

మిడిలార్డర్‌లో షై హోప్- 41, లోయర్ ఆర్డర్‌లో ట్రిస్టన్ స్టబ్స్.. ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా జట్టు స్కోర్ 257 పరుగులకు చేరింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ చిట్టచివరి వరకూ పోరాడింది. హైదరాబాదీ తిలక్ వర్మ 32 బంతుల్లో 63, కేప్టెన్ హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 46, టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులతో ఢిల్లీ కేపిటల్స్‌లో వణుకు పుట్టించారు.

ఒక దశలో మ్యాచ్‌ను లాగేసుకున్నట్టే కనిపించినా చివర్లో ఒత్తిడికి గురి కావడం, వికెట్లు పడటంతో ఓటమి తప్పలేదు. 247 పరుగుల వద్ద ఆగిపోయిందా జట్టు ప్రస్థానం. నిర్ణీత 20 ఓవర్లల్లో 247 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచ్ ఓటమితో డీలా పడ్డ ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఓపెనర్ ఇషాన్ కిషన్‌పై భారీగా జరిమానా విదించింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందున అతనిపై ఫైన్ పడింది. ఇది లెవెల్ 1 అఫెన్స్. ఈ అఫెన్స్‌ను ఇషాన్ కిషన్ సైతం అంగీకరించాడు. అదేమిటనేది బీసీసీఐ వెల్లడించలేదు.

వికెట్లను తన్నడం, ఉద్దేశపూరకంగా, నిర్లక్ష్యంగా డ్రెస్సింగ్ రూమ్ తలుపులు, అద్దాలు, కిటికీలు, ఏవైనా ఇతర వస్తువులు లేదా బౌండరీ రోప్‌ లేదా అక్కడ అమర్చిన అడ్వర్టైజింగ్ బోర్డులకు నష్టం కలిగించేలా వ్యవహరించడం.. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కిందికి వస్తుంది.

Story first published: Sunday, April 28, 2024, 11:10 [IST]
Other articles published on Apr 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+