Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే నా బెస్ట్ షాట్: సునామీ ఇన్నింగ్ సీక్రెట్ అదే: ఫ్రేజర్ మెక్‌గుర్క్

DC vs MI: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని ఎదుర్కొంది. శనివారం సాయంత్రం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. 10 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆవకాశాలకు దాదాపుగా తెర పడినట్టయింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ చిట్టచివరి వరకూ పోరాడింది. హైదరాబాదీ తిలక్ వర్మ 32 బంతుల్లో 63, కేప్టెన్ హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటారు.

IPL 2024 DC vs MI I am happy that I can hit Bumrah for a six says Jake Fraser-McGurk

లోయర్ ఆర్డర్‌లో టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులతో ఢిల్లీ కేపిటల్స్‌లో వణుకు పుట్టించాడు గానీ చివరి వరకు నిలవలేకపోయాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తరువాత వెంటవెంటనే వికెట్లు పడటంతో ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగలిగింది.

అంతకుముందు ఢిల్లీ కేపిటల్స్.. 257 పరుగుల భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారకుడు.. ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్. సునామీ ఇన్నింగ్ ఆడాడీ యంగ్ టర్క్. 27 బంతుల్లో 6 సిక్సర్లు, 11 పరుగులతో చెలరేగాడు. 84 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో తన రికార్డును తానే సమం చేశాడు.

తన తిరుగులేని ఫామ్‌ను కంటిన్యూ చేస్తోన్నాడు. ఇదివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు జాక్. ఈ మ్యాచ్‌లో కూడా సరిగ్గా 15 బంతుల్లోనే మరోసారి అర్ధసెంచరీని అందుకున్నాడు. రెండు బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచ్‌లల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా సంధించిన ఆఫ్ కట్టర్‌ను సిక్స్‌గా మలిచాడు జాక్. దీనిపై స్పందించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. పైగా అది ఫ్రీ హిట్ అని గుర్తు చేశాడు. ఆ తరువాత కూడా అతను వేసిన యార్కర్‌ను ఫోర్‌గా మలిచానని వ్యాఖ్యానించాడు.

అలాగే హార్దిక్‌ పాండ్యాన బౌలింగ్‌లో బ్యాక్‌ ఫుట్‌ను కొట్టిన షాట్.. గేమ్‌ మొత్తానికీ ది బెస్ట్ అని పేర్కొన్నాడు ఫ్రేజర్-మెక్‌గుర్క్. అది తనకు చాలా ఇష్టమైన షాట్ అని చెప్పాడు. మున్ముందు మళ్లీ అలాంటి షాట్ ఆడకపోవచ్చని, అందుకే ఆ వీడియోను ఫోన్‌లో సేవ్ చేయబోతోన్నానని అన్నాడు.

పవర్-హిటింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడటం పట్ల జాక్ స్పందించాడు. తాను మ్యాచ్ రోజున బ్రేక్ ఫాస్ట్ తీసుకోలేదని, మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు బయలుదేరే ముందు స్ట్రాంగ్ కాఫీ మాత్రమే తాగానని వివరించాడు. తెల్లవారుజామున 3 గంటలకు పడుకుని 12 గంటలకు నిద్ర లేవడం తనకు అలవాటు అని, మ్యాచ్ కోసం తెల్లవారు జామున 2 గంటలకు పడుకుని 11 గంటలకు లేచానని, బ్రేక్ ఫాస్ట్ తీసుకునే టైమ్ దొరకలేదని అన్నాడు.

Story first published: Sunday, April 28, 2024, 13:10 [IST]
Other articles published on Apr 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+