For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్‌కు భారీ జరిమానా.. మరోసారి ఆ తప్పు చేస్తే నిషే‌ధమే!

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషభ్ పంత్‌కు షాక్ ఎదురైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కొనసాగించిన కారణంగా పంత్‌కు భారీ జరిమానా విధించారు. పంత్‌‌కు రూ.24 లక్షలు, మిగిలిన ఢిల్లీ జట్టు ఆటగాళ్లకు రూ.6 లక్షల చొప్పున ఫైన్ విధించినట్లు బీసీసీఐ తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్‌‌పై కూడా జరిమానా వేశామని పేర్కొంది.

''ఐపీఎల్ నియమావళీ ప్రకారం రెండో సారి స్లో ఓవర్ రేటు కొనసాగించినందుకు పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధిస్తున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మిగిలిన ఢిల్లీ తుది జట్టు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ వేస్తున్నాం. రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజు‌లో 25 శాతంలో ఏదీ తక్కువ అయితే అది వర్తిస్తుంది'' అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

IPL 2024 DC vs KKR Pant Slapped with Heavy Fine Repeat Offense Could Result in Ban

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ జరిమానా ఎదుర్కొన్నాడు. తొలిసారి కావడంతో అప్పుడు పంత్ రూ.12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. అయితే మరోసారి స్లో ఓవర్ రేట్ కొనసాగితే పంత్‌కు రూ.30 లక్షల ఫైన్ విధిస్తారు. అంతేగాక ఓ మ్యాచ్‌కు అతడిని నిషేధిస్తారు.

ఈ ఐపీఎల్-2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలిసారి జరిమానాకు గురయ్యాడు. చెపాక్ వేదికగా సీఎస్‌కే‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. కాగా, వైజాగ్ వేదికగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక స్కోరు.

సునీల్‌ నరైన్‌ (85; 39 బంతుల్లో 7×4, 7×6) విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నరైన్‌తో పాటు రఘువంశీ (54; 27 బంతుల్లో 5×04, 3×6), రసెల్‌ (41; 19 బంతుల్లో 4×4, 3×6), రింకూ సింగ్ (26; 8 బంతుల్లో 4×4, 3×6) చెలరేగారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (55; 25 బంతుల్లో 4×4, 5×6), ట్రిస్టియన్‌ స్టబ్స్‌ (54; 32 బంతుల్లో 4×4, 4×6) అర్ధశతకాలతో పోరాడారు.

Story first published: Thursday, April 4, 2024, 11:45 [IST]
Other articles published on Apr 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+