Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కూతుర్ని క్రికెటర్‌ను చేయలనుకుంటున్నాడా?

David Warner: ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ముగిశాయి. మూడు జట్లు మిగిలినవన్నీ కూడా అయిదేసి చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. నేడు వాంఖెడే స్టేడియంలో జరగబోయేది 25వ గేమ్. ముంబై ఇండియన్స్‌ను వాళ్ల సొంత గడ్డపై ఢీ కొట్టబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్ రాయల్స్. అయిదు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో గెలిచింది. మొత్తం ఎనిమిది పాయింట్లతో టాప్‌లో కూర్చుంది. కోల్‌కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ టేబుల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది అయిదో స్థానం.

IPL 2024 David Warner practice session along with his daughter in Lucknow s Ekna stadium

ఈ టేబుల్‌లో అట్టడుగు స్థానాల్లో అంటే- 9, 10లో ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో ఈ రెండు జట్లు కూడా గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. నాలుగింట్లో ఓడాయి. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడి మూడో గేమ్‌లో గెలిచింది ఢిల్లీ కేపిటల్స్. మళ్లీ వరుసగా రెండింట్లో పరాజయాన్ని చవి చూసింది.

తొలి రెండు మ్యాచ్‌లల్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో మట్టికరిచింది ఢిల్లీ. తన హోమ్ గ్రౌండ్ విశాఖపట్నంలో జరిగిన మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ జట్టు పట్టాలెక్కిందని ఆశించినప్పటికీ అది అత్యాశే అయింది. ఆ తరువాత ఆడిన రెండు గేమ్‌లు.. కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ చేతుల్లో మళ్లీ ఓడింది. పరాజయాల బాట పట్టింది.

దీని దెబ్బకు పాయింట్ల పట్టికలో పదో స్థానానికి దిగజారింది ఢిల్లీ. అక్కడి నుంచి పైకి లేవాలంటే అన్ని మ్యాచ్‌లను కూడా గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య తన తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది. శుక్రవారం సాయంత్రం లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక.

ఇది గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడం వల్ల ఢిల్లీ కేపిటల్స్ ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్నారు. ఈ క్రమంలో- ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కూతురితో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో కనిపించారు. పెద్ద కూతురు ఇవి మే వార్నర్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌కు అటెండ్ అయ్యాడు. ఆ సమయంలో ఇవికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో.. మెలకువలను నేర్పించాడు. ఆమెకు బౌలింగ్ వేశాడు.

Story first published: Thursday, April 11, 2024, 12:57 [IST]
Other articles published on Apr 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+