ఐపీఎల్ చరిత్ర తిరగరాసిన సన్‌రైజర్స్..!!
CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక. రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం. తాము ఆడిన చివరి మ్యాచ్‌లల్లో ఈ రెండు జట్లు కూడా వేర్వేరు ప్రత్యర్థులపై ఓడిపోయాయి. ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్‌తో పోల్చుకుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో అయిదింట్లో నెగ్గింది సన్‌రైజర్స్. 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచింది. ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ కూడా గెలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటుంది. 12 పాయింట్లతో ముందంజ వేస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మరీ అంతగా దిగజారిపోలేదు. ఎనిమిది మ్యాచ్‌లల్లో నాలుగింట్లో గెలిచింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. తాను ఆడిన చివరి రెండు మ్యాచ్‌లను కూడా ఓడిపోవడం ఆ జట్టు నెట్ రన్‌రేట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. లక్నో సూపర్ జెయింట్ప్‌పై ఆడిన రెండింట్లోనూ పరాజయం పాలైందీ టీమ్.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ రేంజ్‌లో రెచ్చిపోయి ఆడుతోందో చూస్తోన్నాం. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసిందీ టీమ్. టీ20 ఫార్మట్ మ్యాచ్‌లకు సరికొత్త అర్థాన్ని ఇచ్చింది. 200 స్కోర్ కొడితే గొప్ప అనుకునే స్థాయిని ఎప్పుడో దాటింది. మిగిలిన జట్లును కూడా తనను ఫాలో అయ్యేలా ట్రెండ్ సృష్టించింది. చరిత్రను తిరగరాసింది.
1. ఇప్పటివరకు 16 ఐపీఎల్ సీజన్లల్లో మొత్తం 1,032 మ్యాచ్‌లు జరిగాయి. రెండు సార్లు మాత్రమే 250కి పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ 17వ సీజన్‌లో మాత్రం ఏకంగా ఎనిమిది సార్లు 250కి పైగా పరుగులు రికార్డయ్యాయి. ఇందులో మూడు మ్యాచ్‌లు సన్‌రైజర్స్‌వే కావడం ఆ జట్టు సత్తాను చాటుతోంది.
2. ఈ సీజన్‌లో 44 మ్యాచ్‌లల్లో అంటే గుజరాత్ టైటాన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఆరంభం కావడానికి ముందు 814 సిక్సులు నమోదయ్యాయి. ఏ సీజన్‌కయినా ఇదే హయ్యెస్ట్.
3. అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లల్లో కూడా సన్‌రైజర్స్‌దే హవా. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఏకంగా 108 సిక్సులను బాదింది. ఈ టేబుల్‌లో టాప్‌లో ఉంది.
4. ఢిల్లీ కేపిటల్స్- 103, ముంబై ఇండియన్స్- 100, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 90, కోల్‌కత నైట్‌రైడర్స్- 87, పంజాబ్ కింగ్స్- 85, రాజస్థాన్ రాయల్స్- 73, చెన్నై సూపర్ కింగ్స్- 65 సిక్సర్లు కొట్టాయి. ఈ జాబితాలో చిట్టచివరన నిలిచింది గుజరాత్ టైటాన్స్. ఆ జట్టు 39 సిక్సర్లు మాత్రమే కొట్టింది.
5. ఒకే ఒక్క మ్యాచ్‌లో 42 సిక్సర్లు నమోదు కావడం కూడా ఈ సీజన్ స్పెషాలిటీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications