కాక మీదున్న సన్‌రైజర్స్‌తో పోరు- సీఎస్‌కేకు అదొక్కటే బిగ్ అడ్వాంటేజ్
CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక. రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం. తాము ఆడిన చివరి మ్యాచ్‌లల్లో ఈ రెండు జట్లు కూడా వేర్వేరు ప్రత్యర్థులపై ఓడిపోయాయి. ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్‌తో పోల్చుకుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో అయిదింట్లో నెగ్గింది సన్‌రైజర్స్. 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచింది. ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ కూడా గెలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటుంది. 12 పాయింట్లతో ముందంజ వేస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మరీ అంతగా దిగజారిపోలేదు. ఎనిమిది మ్యాచ్‌లల్లో నాలుగింట్లో గెలిచింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. తాను ఆడిన చివరి రెండు మ్యాచ్‌లను కూడా ఓడిపోవడం ఆ జట్టు నెట్ రన్‌రేట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. లక్నో సూపర్ జెయింట్ప్‌పై ఆడిన రెండింట్లోనూ పరాజయం పాలైందీ టీమ్.
కాగా- ఈ మ్యాచ్ తన హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో ఆడబోతోండటం చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ అడ్వాంటేజ్. ఈ పిచ్‌పై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది సీఎస్‌కేకు. చెపాక్‌లో సన్‌రైజర్స్‌పై ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌ను కూడా ఓడిపోలేదు చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన అన్నిసార్లూ చెన్నైదే పైచేయి అయింది.
అదొక్కటే కాదు- ఐపీఎల్‌లో ఇప్పటివరకు 20 సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడగా 14 సార్లు విజయం చెన్నైనే వరించింది. ఈ రెండు రికార్డులు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆందోళనకు గురి చేసేవే. అయినప్పటికీ- ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నైని మట్టికరిపించిన అనుభవం ఆరెంజ్ ఆర్మీకి ఉంది.
ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయింది చెన్నై. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. 18.1 ఓవర్లల్లో నాలుగు వికెట్లను కోల్పోయి ఈ టార్గెట్‌ను ఛేదించింది హైదరాబాద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications