Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో: ఈ ఓవరాక్షనే తగ్గించుకోమనేది

Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‌లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. తొలి మ్యాచ్‌తోనే తన జైత్రయాత్రను ఆరంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించి.. తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

చెన్నై చెపాక్‌ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ధాటికి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడ్డ బౌలర్లు ఆ తరువాత రిథమ్‌ను అందిపుచ్చుకున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

IPL 2024 CSK vs RCB Virat Kohli gives a controversial reaction to Rachin Ravindra

నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెష్ట నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనూజ్ రావత్, దినేష్ కార్తీక్ డెత్ ఓవర్లల్లో విజృంభించడంతో పోరాడ దగ్గ పరుగులను చేయగలిగింది ఆర్సీబీ. 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అనూజ్ రావత్- 48 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన దినేష్ కార్తీక్ చివరికి ఆర్సీబీకి ఆపద్బాంధవుడిగా మారాడు. 26 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

ఆర్సీబీ నిర్దేశించిన టార్గెట్‌ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇంకా ఎనిమిది బంతులు మిగలివుండగానే లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసింది. ఛేజింగ్‌లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది.

సూపర్ కింగ్స్ బ్యాటర్లందరూ సమష్టిగా రాణించారు. ప్రత్యేకించి రచిన్ రవీంద్ర. కేరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే మెరుపు ఇన్నింగ్ ఆడాడీ లెఫ్ట్ హ్యాండర్ న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్. 15 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 37 పరుగులు బాదాడు. ఆర్సీబీ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై స్వేచ్ఛగా ఆడాడు. ప్రతి బంతినీ భారీ షాట్ కొట్టాడు.

ఇన్నింగ్ నాలుగో ఓవర్ చివరిబంతికి అవుట్ అయ్యాడు. కర్ణ్ శర్మ సంధించిన ఓవర్ అది. మిడిల్, లెగ్ స్టంప్ మీద పడ్డ బంతిని స్వీప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. డీప్ బ్యాక్‌వర్డ్ స్వేర్ లెగ్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని రజత్ పటిదార్ అందుకున్నాడు.

రచిన్ రవీంద్ర అవుట్ అయిన తరువాత విరాట్ కోహ్లీ వివాదాస్పదంగా వ్యవహరించాడు. కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. అవుట్ అయి పెవిలియన్ దారి పట్టిన రచిన్‌ను గ్రౌండ్ వెళ్లిపోవాలంటూ చేతులు ఊపడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Story first published: Saturday, March 23, 2024, 10:09 [IST]
Other articles published on Mar 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+