CSK vs RCB Match :ఆర్సీబీని నంజుకుతింటున్నారు..!
CSK vs RCB IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌ను ఓటమితో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..ఇప్పుడు సోషల్ మీడియాకు టార్గెట్ అయింది. మున్ముందు ఈ టీమ్ ఎలా ఆడుతుందో తెలియదు గానీ ఐపీఎల్ 2024 ఓపెనర్‌లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలవడం మాత్రం ట్రోల్స్‌కు దారి తీసింది. మీమ్స్‌ను పోస్ట్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు ఫ్యాన్స్.
చెన్నై చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ- ప్రారంభ ఓవర్లల్లో ధాటిగా ఆడినా.. ఆ తరవాత చతికిలపడింది. చెన్నై బౌలర్ల ధాటికి టాప్, మిడిలార్డర్ బ్యాటింగ్ కుప్పకూలింది.

నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెష్ల నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేయగా.. దాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది సీఎస్‌కే. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది. 15 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 37 పరుగులు బాదిన ఓపెనర్ రచిన్ రవీంద్ర టాప్ స్కోరర్. చివర్లో శివమ్ దుబే మెరుపు ఇన్నింగ్ ఆడాడు.
ఈ ఓటమి అనంతరం మీమ్స్ సునామీలో చిక్కుకున్నట్టయింది ఆర్సీబీ పరిస్థితి. ఎప్పుడు ఆర్సీబీ ఓడిపోతుందా అని కాచుకుని కూర్చున్నట్టు కనిపించారు మీమర్స్. మ్యాచ్ ముగియకముందే ఫలితాన్ని ఊహించారు. మీమ్స్‌తో ఆర్సీబీని ఓ ఆట ఆడేసుకున్నారు. వీరిలో వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం ఉన్నారు.
కొద్దిరోజుల ముందు విమెన్స్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడాన్ని గుర్తు చేస్తూ మరీ పుండుపై కారం చల్లారు. స్మృతి మంధనతో కంపేర్ చేశారు. విమెన్స్ ఐపీఎల్ గెలిచిన ఆర్సీబీ- ఈ ఓటమితో నేలమీదికి వచ్చినట్టయిందంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications