Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs RCB IPL 2024: ధోనీ కేరీర్ దానితోనే ఆరంభం - దానితోనే అంతం..!

MS Dhoni: ఎప్పుడెప్పుడా అంటూ ఇన్నాళ్లూ ఎదురు చూస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ తొలి మ్యాచ్‌ క్రికెట్ ప్రేమికుల కళ్లముందు సాక్షాత్కరించింది. ఈ రాత్రి సరిగ్గా 8 గంటలకు వైడ్‌తో మొదలైంది. టాస్ ఓడిపోయి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పేస్ బౌలర్ దీపక్ చాహర్.. తొలి బంతిని వైడ్‌గా సంధించాడు.

చెన్నై చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ తొలి ఓవర్లల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సునామీలా బౌలర్లపై విరుచుకుపడింది. కేప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదాడు. తుషార్ దేశ్‌పాండేనూ వదల్లేదు. అసలు సిసలు టీ20 క్రికెటింగ్ షాట్లు ఆడాడు ఫాఫ్.

IPL 2024 CSK vs RCB Dhoni started his career with long hair and ending with same

23 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లతో 35 పరుగులు చేసి పీక్స్‌లో ఆడుతున్న దశలో ఓ పేలవ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి టైమింగ్ మిస్ అయ్యాడు. ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కట్టర్‌ను డీప్ పాయింట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు ఫాఫ్. గాల్లోకి లేచిన బంతిని రచిన్ రవీంద్ర ముందుకు డైవ్ చేస్తూ అందుకున్నాడు.

ఆ తరువాత కూడా వికెట్లు టపటపామంటూ పడ్డాయి. అయిదో ఓవర్ చివరిబంతికి రజత్ పటిదార్‌ను బలి తీసుకున్నాడు ముస్తాఫిజుర్. వికెట్ల మీదికి దూసుకొచ్చిన గుడ్ లెంగ్త్ బంతిని ఆడటంలో కాస్త తడబడ్డాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ చేతుల్లో వాలింది. ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు పటిదార్.

దీనితో అయిదు ఓవర్లల్లో 41 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయింది ఆర్సీబీ. ఆ మరుసటి ఓవర్‌లోనే మరో వికెట్. ఈ సారి గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూపంలో పడింది. అది కూడా గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మ్యాక్సీ.

బ్యాక్ అండ్ బ్యాక్ రెండు క్యాచ్‌లతో ఎంఎస్ ధోనీ ఫుల్ ఫామ్‌లో కనిపించాడు. 42 సంవత్సరాల వయస్సులో వికెట్ల వెనుక మెరుపులా కదిలాడు. వింటేజ్ లుక్స్‌తో అదరగొట్టాడు. భుజాల వరకు దిగిన పొడవాటి జుట్టుతో పాత ధోనీని గుర్తు చేశాడీ జార్ఖండ్ డైనమేట్. కేరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్‌తో కనిపించిన ధోనీ.. కేరీర్ ఎండ్‌లోనూ అదే బ్రాండ్‌తో మెరిశాడు.

Story first published: Friday, March 22, 2024, 21:40 [IST]
Other articles published on Mar 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+