For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK Playing XI: స్టార్ ప్లేయర్ ఎంట్రీ.. SRH‌తో ఆడే తుదిజట్టు ఇదే

ఐపీఎల్-2024 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు 16 మాత్రమే. కానీ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు 277, 272 పరుగులు నమోదయ్యాయి. ఈ రెండు టాప్ స్కోర్‌లు మన తెలుగు గడ్డపైనే నమోదవ్వడం విశేషం. ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్, వైజాగ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ చితక్కొట్టాయి. అయితే పరుగుల వరద పారిన ఉప్పల్ పిచ్‌పై మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

హైదరాబాద్ వేదికగా రేపు చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన SRH ఒక్క విజయం మాత్రమే సాధించింది. అత్యధిక స్కోరు సాధించిన మ్యాచ్ మినహా మిగిలిన రెండింట్లో ఓటమిపాలైంది. మరోవైపు సీఎస్‌కే ఆడిన మూడింట్లో రెండు విజయాలు సాధించింది. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో గెలిచి తిరిగి గెలుపు బాట పట్టాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.

IPL 2024 CSK playing XI vs SRH - Shardul Thakur likey to replace Mustafizur Rahman

SRH vs CSK
ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్కేనే పైచేయి సాధించింది. ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై 19 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో సీఎస్కే 15 మ్యాచ్‌లు, సన్‌రైజర్స్ 4 మ్యాచ్‌లు గెలిచాయి. 2023 సీజన్‌లో ఒక్కసారి మాత్రమే రెండు జట్లు పోటీ పడగా అప్పుడు ధోనీ సేన గెలిచింది. కాగా, 2022 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడగా ఇరు జట్లు చెరో విజయం సాధించాయి.

పర్పుల్ క్యాప్ విజేత దూరం
అయితే సీఎస్‌కే ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచకప్‌లో పాల్గొనడానికి వీసా ఏర్పాట్ల కోసం బంగ్లాదేశ్‌కు వెళ్లాడు. దీంతో రేపటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ముస్తాఫిజుర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన ముస్తాఫిజుర్ దూరమవ్వడం జట్టుకు ప్రతికూలాంశమే.

శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ
ముస్తాఫిజుర్ స్థానంలో జట్టులోకి రావడానికి శార్దూల్ ఠాకూర్, స్పిన్నర్ తీక్షణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పేసర్ శార్దూల్ బ్యాటుతోనూ సత్తాచాటగలడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ పిచ్ అయిన ఉప్పల్‌పై ముస్తాఫిజుర్ స్థానంలో శార్దూల్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సీఎస్కే తుది జట్టు అంచనా
రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర , అజింక్య రహానె , డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా , సమీర్ రిజ్వీ , ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్ , తుషార్ దేశ్‌పాండే , మతీషా పతిరనా, శార్దూల్ ఠాకూర్.
ఇంపాక్ట్ ప్లేయర్: శివమ్ దూబె

సీఎస్కే పూర్తి జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర , అజింక్య రహానె , డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా , సమీర్ రిజ్వీ , ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్ , తుషార్ దేశ్‌పాండే , మతీషా పతిరనా, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబె, తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షేక్ రషీద్ , మొయిన్ అలీ , మిచెల్ శాంట్నర్ , నిశాంత్ సింధు , డెవాన్ కాన్వే , అజయ్ జాదవ్ మండల్ , ప్రశాంత్ సోలంకి , ముకేష్ చౌదరి , సిమర్జీత్ సింగ్ , అరవల్లీ అవనీశ్, హంగర్లేకర్.

Story first published: Thursday, April 4, 2024, 14:33 [IST]
Other articles published on Apr 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+