Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!

LSG vs CSK: ఐపీఎల్ 2024 టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఇప్పటివరకు వరుసగా రెండు మ్యాచ్‌లల్లో విజయదుందుభి మోగించిన ఈ జట్టు- నేడు కీలక గేమ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది.

ఈ సాయంత్రం 7:30 గంటలకు లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. చివరి రెండు మ్యాచ్‌లల్లో కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్‌ను ఓడించి దూకుడు మీద ఉంది చెన్నై సూపర్ కింగ్స్. మొత్తంగా ఆరు మ్యాచ్‌లల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లను ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

IPL 2024 CSK have signed England pacer Richard Gleeson as replace for injured Devon Conway

అటు దీనికి భిన్నంగా ఉంది లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి. తాను ఆడిన చివరి రెండు మ్యాచ్‌లల్లో ఓటములను చవి చూసింది. ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. మొత్తంగా ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో మూడింట్లో గెలిచింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొన్ని మార్పులు- చేర్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే గాయపడిన విషయం తెలిసిందే. అతని వేలికి ఫ్రాక్చర్ అయింది. ఐపీఎల్ సెకెండ్ హాఫ్ నాటికి అందుబాటులోకి వస్తాడని తొలుత అంచనాలు వెలువడ్డాయి గానీ అవి వాస్తవ రూపం దాల్చలేకపోయాయి.

వేలి గాయం వల్ల ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికే దూరం అయ్యాడు డెవాన్ కాన్వే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదీ డాషింగ్ ఓపెనర్. గాయం వల్లే అతను జట్టుకు అందుబాటులోకి రాలేదు. మలి సగం మ్యాచ్‌కు వస్తాడని భావించినప్పటికీ అది సాధ్యపడట్లేదు.

దీనితో డెవాన్ కాన్వే స్థానంలో మరో కొత్త ప్లేయర్‌ను తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో అతన్ని టీమ్‌లోకి తీసుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ వెల్లడించింది.

2022లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అడుగు పెట్టాడు రిచర్డ్ గ్లీసన్. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌పై ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తొలి ఎనిమిది బంంతుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్ ఆడటం అతనికి ఇదే తొలిసారి. అంతకుముందు- బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, సౌతాఫ్రికా 20, ఐఎల్టీ 20ల్లో ఆడిన అనుభవం రిచర్డ్‌కు ఉంది.

Story first published: Friday, April 19, 2024, 10:33 [IST]
Other articles published on Apr 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+