Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీతో మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్‌కు మస్త్ మజా

CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ జట్లు పోటీ పడనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్ కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ వరకూ సీఎస్‌కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

IPL 2024 Chennai Super Kings dominates RCB

చెన్నై సూపర్ కింగ్స్- మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. 2008 నుంచి గత సీజన్ వరకూ అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మరో అయిదుసార్లు ఫైనల్స్‌కు చేరిన జట్టది. ఇప్పుడు కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. టైటిల్ హాట్ ఫేవరెట్‌‌గా సీజన్‌ను ఆరంభించబోతోంది.

రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఒక్కసారి కూడా కప్‌ గెలిచిన పాపాన పోలేదు. ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే ఫైనలిస్ట్. చివరిసారిగా ఫైనల్స్‌లో అడుగు పెట్టి కూడా చాలాకాలమైంది. 2016లో ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయాన్ని చవి చూసిన తరువాత మళ్లీ ఇప్పటివరకూ సెమీస్ దాటలేదు. ఈ సారి మాత్రం కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది బెంగళూరు.

రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్‌లో 31 సార్లు తలపడగా.. చెన్నైదే పైచేయి. తిరుగులేని విజయానలను అందుకుంది. ఐపీఎల్‌లో 20 సార్లు ఆర్సీబీని మట్టికరిపించింది సూపర్ కింగ్స్. ఆర్సీబీ 10 సార్లు మాత్రమే చెన్నైని ఓడించగలిగింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

Story first published: Friday, March 22, 2024, 14:29 [IST]
Other articles published on Mar 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+