Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: కోల్‌కతా కెప్టెన్సీలో మార్పు.. శ్రేయస్ కోసం నితీశ్ రాణా త్యాగం!

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తిరిగి ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత సీజన్‌కు శ్రేయస్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ గైర్హాజరీలో నితీశ్ రాణా 2023 సీజన్‌లో కోల్‌కతా జట్టును నడిపించాడు. ఇప్పుడు శ్రేయస్ తిరిగి వస్తుండటంతో రాణాను కెప్టెన్‌గా తొలగించి వైస్ కెప్టెన్‌గా నియమించిది. ఈ మేరకు కేకేఆర్ ప్రకటన రిలీజ్ చేసింది.

''దురదృష్టవశాత్తు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ గత సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంటున్నందకు సంతోషంగా ఉంది. గాయం నుంచి కోలుకోవడానికి అతడు పడిన శ్రమ, తన ఫామ్‌ను ప్రదర్శించిన తీరు అతడి పట్టుదలకు నిదర్శనం. గత సీజన్‌లో శ్రేయస్ గైర్హాజరీలో జట్టును నడిపించిన నితీశ్ రాణాకు ధన్యవాదాలు. వైస్ కెప్టెన్‌గా రాణా శ్రేయస్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తాడనడంలో సందేహం లేదు'' అని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నాడు.

IPL 2024: Change in Kolkata captaincy.. Nitish Rana sacrifice for Shreyas Iyer

కెప్టెన్సీ బాధ్యతల గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... ''గాయం కారణంగా నేను దూరమవ్వడంతో పాటు గత సీజన్ లో మా జట్టు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కెప్టెన్‌గా నా స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా నితీశ్ రాణా గొప్ప నాయకత్వం చూపించాడు'' అని అన్నాడు. గత సీజన్ లో కోల్‌కతా పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ ల్లో ఆరు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది.

అయితే ఐపీఎల్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ లో నిలకడ పరుగులు చేసిన శ్రేయస్ ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. ప్రపంచకప్ ఫైనల్‌కు టీమిండియా చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Thursday, December 14, 2023, 15:28 [IST]
Other articles published on Dec 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+