Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH టాప్-2లో నిలవాలంటే.. ఆ జట్టు ఓడిపోవాలి!

ఐపీఎల్‌-2024 సీజన్‌లో లీగ్ దశ క్లైమాక్స్‌కు చేరింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లే మూడు జట్లు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తదుపరి దశకు చేరాయి. ఇక మిగిలిన ఒక బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే గెలిస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

కానీ ఆర్సీబీ తుదిపరి దశకు చేరుకోవాలంటే నెట్‌రన్‌రేటు చాలా కీలకం. సీఎస్కే తొలుత ఓ 200 పరుగులు చేసిందనకుంటే దాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలుండగానే ఛేదించాలి. లేదా ఆర్సీబీనే మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

IPL 2024 Can Sunrisers Hyderabad Still Secure a Top-2 Finish

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఆర్సీబీకి నిరాశే. సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో ప్లేఆఫ్స్ రేసు ముగుస్తుంది. అయితే టాప్-2లో ఏఏ జట్లు నిలుస్తాయనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంటుంది. అందుకే టాప్-2 ప్లేస్‌ కోసం పోటీ తీవ్రంగానే ఉంటుంది.

టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయిర్-1కు చేరుకుంటాయి. అందులో గెలిచిన జట్లు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయిర్-2లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన విజేతతో పోటీపడుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయనే విషయం తెలిసిందే. ఇక క్వాలిఫయిర్-1, క్వాలిఫయిర్-2లో గెలిచిన జట్లు అంతిమ పోరుకు అర్హత సాధిస్తాయి.

అయితే కేకేఆర్ (19) అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక పోటీ అంతా రెండో స్థానం కోసమే. 15 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఎస్‌ఆర్‌హెచ్ టాప్-2లో నిలవాలంటే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించాలి. అలాగే కోల్‌కతా చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. ఒకవేళ హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా మన తెలుగు జట్టు రెండో స్థానానికి చేరవచ్చు.

కానీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆర్సీబీ తప్పక ఓడించాలి. అలాగే కేకేఆర్ చేతిలో రాజస్థాన్ ఓటమిపాలైతే హైదరాబాద్ టాప్-2లో నిలిచి క్వాలిఫయిర్-1కు దూసుకెళ్తుంది. సీఎస్కే రెండో స్థానానికి వెళ్లాలంటే.. ఆర్సీబీపై గెలవాలి, అంతేగాక రాజస్థాన్, సన్‌రైజర్స్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడాలి. రాజస్థాన్ రాయల్స్ టాప్-2కు వెళ్లాలంటే... కోల్‌కతాపై నెగ్గాలి.

Story first published: Friday, May 17, 2024, 8:09 [IST]
Other articles published on May 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+