For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: CSKకి బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ దూరం

ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గత సీజన్‌లో సీఎస్‌కే టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే.. ఈ సీజన్‌లో దాదాపు సగం మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. గుజరాత్ టైటాన్స్ జరిగిన ఫైనల్‌లో కాన్వే అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

అయితే గాయం కారణంగా మే వరకు ఐపీఎల్‌లో కాన్వే బరిలోకి దిగే అవకాశాలు లేవు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కాన్వే ఎడమ బొటనవేలికి తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు కూడా అతడు దూరమయ్యాడు. మరోవైపు వైద్యసిబ్బంది సూచనల మేరకు ఈ వారంలో కాన్వే శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో కాన్వే కనీసం రెండు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.

IPL 2024 Bad news for CSK Star player away due to injury

కాన్వే స్థానంలో అజింక్య రహానె లేదా రచిన్ రవీంద్రను ఓపెనర్‌గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన మినీ వేలంలో రవీంద్రను సీఎస్‌కే రూ.1.80 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్లలో టాప్ ఆర్డర్‌లో సత్తాచాటగలనని రచిన్ రవీంద్ర ఇప్పటికే నిరూపించుకున్నాడు. మరోవైపు ఓపెనర్‌గా గత ఐపీఎల్ సీజన్లలో రాణించిన రహానె ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడు. రంజీ ట్రోఫీలో పరుగులు సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారే అర్ధశతకాన్ని అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా రచిన్‌‌ను సీఎస్‌కే యాజమాన్యం ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక చేతివాటం పరంగా ఓపెనర్‌గా రచిన్‌‌‌యే ఖాయమనిపిస్తోంది. రైట్ హ్యాండెడ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడానికి ఎడమచేతి వాటం బ్యాటర్ కావాలనే సీఎస్‌కే కోరుకుంటుంది. రచిన్ ఎడమచేతి వాటం బ్యాటర్ అనే విషయం తెలిసిందే.

IPL 2024 Bad news for CSK Star player away due to injury

కాగా, మార్చి 22 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగానే సీఎస్‌కే తమ ఆటగాళ్లకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. ఇప్పటికే కొందరు సీఎస్‌కే ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.

చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానె, ఎంఎస్ ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, శివమ్ దూబె, మొయిన్ అలీ, అజయ్ మండల్, నిశాంత్ సింధు, మిచెల్ శాంట్నర్, మహేశ్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, మతీషా పహాన్‌గర్, మతీషా పహంగర్ , ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, షేక్ రషీద్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహ్మన్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, అరవెల్లి అవనీష్.

Story first published: Monday, March 4, 2024, 8:13 [IST]
Other articles published on Mar 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+