Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 Auction: స్టార్క్‌కు భారీ ధర.. సన్‌రైజర్స్‌కు కమిన్స్

ఐపీఎల్ వేలం-2024కి రంగం సిద్ధమైంది. రేపు దుబాయ్ వేదికగా మినీ వేలం ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు వేలం మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌లో, జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.

అయితే ఐపీఎల్ ఆక్షన్ అనుభవాన్ని ఫ్రాంచైజీలకు కలిగించడానికి ఇవాళ ఐపీఎల్ మాక్ ఆక్షన్ నిర్వహించారు. ఈ మాక్ ఆక్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేశ్ రైనా, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఇయాన్ మోర్గాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మైక్ హెసన్, గుజరాత్ టైటాన్స్ తరపున పార్థివ్ పటేల్ వేలంలో పాల్గొన్నారు.

IPL 2024 Auction: In IPL Mock Auction, Michelle Star fetches a huge price.Suresh Raina who is bidding for Chennai super kings

అయితే ఈ మాక్ వేలంలో ఆర్సీబీ మిచెల్ స్టార్క్‌ను రూ.18.5 కోట్లకు దక్కించుకుంది. దక్షిణాఫ్రికా యువ సంచలనం కొయెట్జీ రూ.18 కోట్లకు, కమిన్స్ రూ. 17.5 కోట్లకు , శార్దూల్ ఠాకూర్ రూ.14 కోట్లు దక్కించుకున్నారు. గుజరాత్‌కు కొయొట్జీ వెళ్లగా, కమిన్స్‌ను సన్‌రైజర్స్ తీసుకుంది. ఇక రూ.10.5 కోట్లకు మధుశంకను కోల్‌కతా; రూ.9.50 కోట్లను వెచ్చించి హ్యారీ బ్రూక్‌ను గుజరాత్, రూ.8.50 కోట్లు చెల్లించి హసరంగను చెన్నై దక్కించుకుంది. కాగా, అసలైన వేలం రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది.

ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న పర్స్ వాల్యూ
1. చెన్నై సూపర్ కింగ్స్-రూ. 31.4 కోట్లు
2. ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.28.95 కోట్లు
3. గుజరాత్ టైటాన్స్ -రూ. 38.15 కోట్లు
4. కేకేఆర్ -రూ. 32.7 కోట్లు
5.ఎల్‌ఎస్‌జీ -రూ. 13.5 కోట్లు
6.ముంబై ఇండియన్స్ -రూ.17.75 కోట్లు
7. పంజాబ్ కింగ్స్ -రూ. 29.1 కోట్లు
8. ఆర్‌సీబీ -రూ.23.25 కోట్లు
9. రాజస్థాన్ రాయల్స్ -రూ. 14.5 కోట్లు
10. ఎస్‌ఆర్‌హెచ్ -రూ. 34 కోట్లు

Story first published: Monday, December 18, 2023, 15:58 [IST]
Other articles published on Dec 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+