Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్ ఫాస్టెస్ట్ 50 రికార్డును చెరిపేసిన ఐపీఎల్ స్టార్: 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో ఓడిన ఈ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై అదరగొట్టింది. భారీ టార్గెట్‌ను ఛేదించింది. హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది. నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట విజయాలను అందుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది.

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది పంజాబ్. మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో 199 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. 48 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు చేసిన కేప్టెన్ శుభ్‌మన్ గిల్.. టాప్ స్కోరర్.

IPL 2024 Ashutosh s half-century in Syed Mushtaq Ali Trophy beats Yuvraj Singh s 12-ball 50

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు.. ఇంకా ఒక్క బంతి మిగిలివుండగానే ఈ టార్గెట్‌ను కొట్టిపడేశారు. 19.5 ఓవర్లల్లో 200 పరుగులు చేశారు. రెండు వరుస ఓటముల తరువాత గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించారు. ప్రత్యేకించి- డెత్ ఓవర్లల్లో విజృంభించి ఆడారు.

చివరి ఓవర్లల్లో అశుతోష్ శర్మ సునామీ ఇన్నింగ్ ఆడాడు. 17 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పించ్ హిట్టింగ్‌కు అశుతోష్ శర్మ కేరాఫ్. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊపిరి సలపనివ్వకపోవడంలో దిట్ట. లోయర్ ఆర్డర్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడగల కెపాసిటీ అతని సొంతం.

ఇలాంటి ఇన్నింగ్ ఆడటం అతనికి కొత్తేమీ కాదు. గతంలో యువరాజ్ సింగ్ రికార్డునే చెరిపేసిన ఘనుడు. టీ20ల్లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు యువరాజ్ సింగ్ సొంతం. గత ఏడాది దీన్ని బద్దలు కొట్టాడీ రైల్వేస్ రంజీ ప్లేయర్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌తో రైల్వేస్ తరఫున ఆడిన మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

2018లో తొలిసారిగా మధ్యప్రదేశ్ తరఫున రంజీల్లో ఆడాడు అశుతోష్ శర్మ. ఈ మరుసటి ఏడాదిలోనే మధ్యప్రదేశ్‌ను వీడాడు. రైల్వేస్ ప్రాతినిథ్యాన్ని వహించాడు. ప్రస్తుతం కోల్‌కత నైట్ రైడర్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తోన్న చంద్రకాంత్ పండిట్ శిష్యుడిగా గుర్తింపు ఉంది. కోల్‌కతలోకి అశుతోష్‌ను తీసుకోవడానికి చంద్రకాంత్ ప్రయత్నించాడు గానీ సాధ్యపడలేదు. ప్రీతి జింటా అతన్ని ఎగరేసుకెళ్లింది.

Story first published: Friday, April 5, 2024, 13:54 [IST]
Other articles published on Apr 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+