Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: KKR‌లో చేరిన మరో విధ్వంసకర బ్యాటర్

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది. అయితే లీగ్ ప్రారంభంకాక ముందే కేకేఆర్ తమ వ్యూహాలు మొదలుపెట్టింది. ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిలిప్ సాల్ట్‌ను జట్టులో చేర్చుకుంది.

జేసన్ రాయ్ స్థానంలో సాల్ట్ జట్టులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు జేసన్ రాయ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వేలంలో అమ్ముడుపోని ఫిలిప్ సాల్ట్‌తో రాయ్ స్థానాన్ని కేకేఆర్ భర్తీ చేసింది. గతేడాది సాల్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఆకట్టుకునే ప్రదర్శన సాల్ట్ చేయకపోవడంతో ఢిల్లీ అతన్ని వదులుకుంది.

Philip Salt has joined the KKR team in place of Jason Roy

ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఫిలిప్ సాల్ట్ రూ. 1.50 కోట్లతో బరిలోకి దిగాడు. కానీ అతన్ని దక్కించుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కోల్‌కతా అదే ధరకు సాల్ట్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే వేలానికి ముందు ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. టీ20ల్లో శతకాల మోత మోగించాడు.

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పరుగుల వదర పారించాడు. 40, 25, 109*, 119; 38 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా సాల్ట్ రికార్డు నెలకొల్పాడు. దీంతో ఫిలిప్ సాల్ట్‌కు వేలంలో మంచి డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. కాగా, వేలంలో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రానా, రింకూ సింగ్, రెహ్మానుల్లా గుర్బాజ్, సునిల్ నరైన్, ఫిలిప్ సాల్ట్, సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రూ రసెల్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, KS భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, రఘువంశీ, రమణదీప్ సింగ్, రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ రెహ్మన్, అట్కిన్సన్, సాకిబ్ హుస్సేన్.

Story first published: Sunday, March 10, 2024, 18:44 [IST]
Other articles published on Mar 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+