Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే గంభీర్ మామూలోడు కాదు- అంబటి రాయుడు

కోల్‌క‌తా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయడు ప్రశంసల జల్లు కురిపించాడు. కేకేఆర్ విజయాలు సాధించడంలో గంభీర్‌ది కీలక పాత్ర అని కొనియాడాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా జట్టు విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కోల్‌కతా నిలిచింది.

13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ తొమ్మిదింట్లో నెగ్గింది. 19 పాయింట్లతో పట్టికలో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. కోల్‌కతా తన చివరి మ్యాచ్‌లో ఓడినా టాప్-2లోనే లీగ్ దశను ముగిస్తోంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన ఏ జట్టూ 19 పాయింట్లను అధిగమించలేదు. దీంతో క్వాలిఫయిర్-1లో కోల్‌కతా బరిలోకి దిగడం ఖాయమైంది.

IPL 2024 Ambati Rayudu Credits Gambhir for KKR s Success

అయితే ఐపీఎల్-2023లో కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఆరు మ్యాచ్‌లే విజయం సాధించి ఏడో స్థానంతో గత సీజన్‌ను పేలవంగా ముగించింది. కానీ ఈ సీజన్‌లో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు అందుకోవడంతో కోల్‌కతా దశ తిరిగింది. 2012, 2014లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్ తిరిగి జట్టులో చేరడంతో ఆటగాళ్లు ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నారు.

మళ్లీ ఓపెనర్‌గా వస్తున్న సునీల్ నరైన్ సత్తాచాటుతున్నాడు. అలాగే యువ ఆటగాళ్లు హర్షత్ రాణా, రఘవంశీ ఉత్తమ ప్రదర్శనలు చేయడంలో గంభీర్‌ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో గంభీర్‌ను రాయుడు కొనియాడాడు. తెరవెనుక కోచింగ్ సిబ్బంది శ్రమిస్తూ, ఆటగాళ్లకు మద్దతు ఇస్తూ, స్వేచ్ఛగా ఆడేలా పరిస్థితులు నెలకొల్పితే జట్లు గొప్పగా రాణించగలగవని రాయుడు అన్నాడు.

గౌతమ్ గంభీర్ అదే పని చేస్తున్నాడని, కేకేఆర్ సరైన దిశలో నడిపిస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఇలా జట్టును సరళంగా నడిపిస్తే, విజయాలు సులభంగా వస్తాయని రాయుడు పేర్కొన్నాడు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. లక్నో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సీజన్‌లో తిరిగి కోల్‌కతా గూటికి చేరుకున్నాడు.

Story first published: Tuesday, May 14, 2024, 18:46 [IST]
Other articles published on May 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+