Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడం తొందరపాటేనా?.. జీటీ నిర్ణయంపై డివిలియర్స్ రియాక్షన్ ఇదీ!

Gujarat Titans: ఐపీఎల్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అందరికీ షాకిచ్చింది. తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించి, రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబైకి ట్రేడ్ చేసేసింది. ఈ నిర్ణయమే అర్థం కాక ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్‌కు మరో దిమ్మతిరిగే షాకిచ్చింది.

ఎవరూ దొరకనట్లు కుర్ర ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను తమ టీం కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ డెసిషన్ చాలా మందికి నచ్చలేదు. దీని వల్ల ఆ టీంతోపాటు టీమిండియాకు కూడా నష్టమే అని అంటున్నారు. కేన్ విలియమ్సన్ వంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్, డేవిడ్ మిల్లర్, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండగా గిల్‌ను ఎలా కెప్టెన్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

IPL 2024 AB de Villiers not happy with GT making Gill captain

అంతమంది సీనియర్లను గిల్ అసలు హ్యాండిల్ చేయగలడా? అనేది కూడా అనుమానమే. అంతర్జాతీయ స్థాయిలో న్యూజిల్యాండ్ జట్టుకు నాయకత్వం వహించిన కేన్ విలియమ్సన్ కూడా ఆ జట్టులో ఉన్నాడు. అతనికి ఐపీఎల్‌లో కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అలాంటి వాడికి జట్టు పగ్గాలు అందించాల్సిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా చేరాడు. విలియమ్సన్ తన సత్తా నిరూపించుకున్న కెప్టెన్ అని, అతనికే జట్టు పగ్గాలు ఇచ్చి ఉండాల్సిందని అన్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాలో స్థానం సంపాదించుకునే వరకు వెయిట్ చేసి, అప్పుడు గిల్‌కు పగ్గాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

'కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకున్నారని చూడగానే.. అతనికే కెప్టెన్సీ ఇస్తారని అనుకున్నా. తను కెప్టెన్సీ అనుభవం కూడా ఉన్న ఫెంటాస్టిక్ ప్లేయర్. గిల్‌కు ముందుగా భారత క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో తన స్థానం సుస్థిరం చేసుకునే టైం అయినా ఇవ్వాలి కదా. అలాగే ఐపీఎల్‌లో ఇంకో మంచి సీజన్ ఆడనివ్వాల్సింది' అని వివరించాడు.

Story first published: Wednesday, November 29, 2023, 19:54 [IST]
Other articles published on Nov 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+