Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబయి ఇండియన్స్‌కు కొత్త బౌలర్ వచ్చాడు

మరో మూడో రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22న నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. అయితే ఆటగాళ్ల గాయాలతో ఫ్రాంచైజీలు అయోమయంలో పడ్డాయి. ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా తర్వాతి మ్యాచ్‌లకు గాయపడ్డ ఆటగాళ్లు తిరిగికోలుకుని వస్తారని కొన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

మరోవైపు అప్పటివరకు ఎదురుచూడకుండా రిప్లేస్‌మెంట్‌తో కొత్త ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంచైజీలు జట్టులోకి తీసుకుంటున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. గాయపడిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బెరెన్‌డార్ఫ్ స్థానంలో ఇంగ్లండ్ పేసర్ ల్యూక్ వుడ్‌ను జట్టులోకి తెచ్చింది. దీని గురించి సోమవారం అధికారిక ప్రకటన చేసింది. కనీస ధర రూ.50 లక్షలతో ల్యూక్ వుడ్‌ను ముంబయి సొంతం చేసుకుంది.

IPL 2024 A new bowler has arrived for Mumbai Indians

28 ఏళ్ల ల్యూక్ వుడ్ ఎడమచేతి వాటం పేసర్. రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. ఎనిమిది వికెట్లు తీశాడు. ల్యూక్ ఎకానమీ రేటు అంత గొప్పగా ఏమీ లేదు. 9.67తో పరుగులు సమర్పించుకున్నాడు. కానీ లెఫ్ట హ్యాండర్ పేసర్ అవ్వడం, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేయడంతో ల్యూక్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది.

ల్యూక్‌ను తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. శ్రీలంక ప్లేయర్ దిల్షాన్ మధుశంక గాయపడటం. ఇటీవల రూ. 4.60 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం పేసర్ మధుశంక తొడకండరరాల సమస్యతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభమ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ సీజన్‌లో ఆడటం కూడా అనుమానమే. దీంతో లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ కావాలనే ఉద్దేశంతో ల్యూక్‌ను జట్టులోకి ముంబై ఆహ్వానించింది.

ముంబై ఇండియన్స్‌ మరో విదేశీ ఫాస్ట్ బౌలర్ కొయెట్టీ కూడా ఈ సీజన్‌లో పాల్గొనడం సందేహాలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా యువ సంచలనం కొయెట్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గజ్జల్లో గాయంతో అతడు ఆటకు దూరమై దాదాపు మూడు నెలలు అయ్యింది. కొయెట్జీ గాయం గురించి ముంబై ఇండియన్స్ వైద్య సిబ్బంది ఆరాతీస్తుంది. కాగా, వన్డే వరల్డ్ కప్‌లో కొయెట్జీ ఎనిమిది మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, March 19, 2024, 9:29 [IST]
Other articles published on Mar 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+