Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంకో మూడు సిక్సులు పడితే..!!

SRH vs LSG: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. తన సమవుజ్జీగా ఉంటోన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సన్‌రైజర్స్‌కు. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం గెలవక తప్పదు. ఈ మ్యాచ్ గెలిస్తే నాకౌట్స్‌కు మరింత చేరువ అవుతుంది. 14 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందుడుగు వేయగలుగుతుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఆరింట్లో నెగ్గింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

IPL 2024 3 short for the 1000 sixes in the ongoing season

సన్‌రైజర్స్ కాకుండా మరో మూడు జట్లు- చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాల్లో కూడా 12 పాయింట్లు ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌లో గెలవగలిగితే ఈ మూడు జట్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఈక్వేషన్లు, నెట్ రన్‌రేట్‌ లెక్కలతో సంబంధం లేకుండా తన ప్లేఆఫ్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.

ఈ మ్యాచ్‌‌ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మన హైదరాబాద్ గడ్డపై ఈ ఐపీఎల్ 2024 సీజన్‌లో 1,000 సిక్సులు మార్క్‌ను దాటడాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 56 మ్యాచ్‌లల్లో 997 సిక్సర్లు రికార్డయ్యాయి. ఇంకో మూడు సిక్సులు పడితే.. 1,000 మార్క్‌ను అందుకుంటుంది.

2023 ఐపీఎల్ సీజన్ మొత్తం మీద 1,124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో 56 మ్యాచ్‌లల్లోనే ఈ సంఖ్య 997గా నమోదైంది. ఇంకా 15 మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఈ సీజన్ మొత్తం ముగిసే సరికి 1,124 రికార్డు చెరిగిపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో కోల్‌కత నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను కొట్టిన సిక్సర్ల సంఖ్య 32. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‌ది రెండో స్థానం. అతని పేరు మీద 31 సిక్సులు రికార్డయ్యాయి. ఈ సాయంత్రం నాటి మ్యాచ్‌తో అతను టాప్‌లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

అభిషేక్ శర్మ- 29, రియాన్ పరాగ్- 28, రిషభ్ పంత్- 27, శివం దుబే- 26, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్- 26, విరాట్ కోహ్లీ- 24, సంజు శాంసన్- 23, ఫిల్ సాల్ట్- 23 సిక్సర్లతో ఈ జాబితాలో టాప్ 10లో ఉన్నారు.

Story first published: Wednesday, May 8, 2024, 15:59 [IST]
Other articles published on May 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+