హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం.. ఏజెంట్. ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. జొనాథన్ రాజ్ షెఖావత్ అనే రా ఏజెంట్‌గా క్యారెక్టర్‌లో అఖిల్ నటించారిందులో. సాక్షి వైద్య హీరోయిన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డీనో మోరియా, విక్రమ్‌జిత్ విర్క్.. ఇతర కీలక పాత్రలను పోషించారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకుడు. హైదరాబాద్, విశాఖపట్నం, బుడాపెస్ట్, మనాలీల్లో షూటింగ్ జరుపుకొంది. హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత అఖిల్ అక్కినేని నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అక్కినేని అభిమానులను నిరాశపరిచాయి.

ఈ నేపథ్యంలో హైబడ్జెట్ అండ్ హైఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఏజెంట్- ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా అఖిల్ అక్కినేని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటాడని ఆశిస్తోన్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు లవర్ బాయ్‌గానే కనిపించిన అఖిల్.. ఈ మూవీలో ఫుల్ ప్లెడ్డ్జ్ యాక్షన్ హీరోగా నటించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. ఏజెంట్ మూవీ సత్తా ఏమిటనేది స్పష్టం చేసింది. ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రిజల్ట్ ఏమిటనేది ఈ నెల 28వ తేదీన వెల్లడవుతుంది. ప్రస్తుతం అఖిల్ అక్కినేని- ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటోన్నారు.
ఈ ప్రమోషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో- ఆయన కామెంటరీ బాక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా క్రికెట్‌ను తన కేరీర్‌గా సెలెక్ట్ చేసుకునే వాడినని స్పష్టం చేశారు.
టీమిండియా మాజీ కేప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీపై తన మనసులో మాట బయటపెట్టారు. విరాట్ కోహ్లీ అనేది పేరు మాత్రమే కాదని, ఓ బ్రాండ్‌గా పేర్కొన్నారు. సమకాలీన క్రికెటర్లల్లో విరాట్ కోహ్లీ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అని అభివర్ణించారు. కోహ్లీ బ్యాటింగ్‌ను చూస్తే బౌలర్లకు పీడకలలొస్తాయని వ్యాఖ్యానించారు.
అఖిల్ అక్కినేని ఓ క్రికెటర్‌గా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నమెంట్స్‌లో భారీగా పరుగుల వరదను పారించాడు. తెలుగు వారియర్స్ క్రికెట్ జట్టుకు సారథి ఆయనే. అఖిల్ అక్కినేని కేప్టెన్సీలో ఇటీవలే విశాఖపట్నం వేదికగా ముగిసిన సీసీఎల్ టోర్నమెంట్‌ను గెలుచుకుంది తెలుగు వారియర్స్ టీమ్.