Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో యంగ్ ప్లేయర్ల తడాఖా: టీమిండియా భవిష్యత్ స్టార్లు వీరే..

ఢిల్లీ: ఐపీఎల్‌ 2023లో గుజరాత్ టైటాన్స్.. ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్‌‌ను ఎగరేసుకెళ్లిన ఈ టీమ్.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఆడుతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లోకల్ టీమ్‌ ఢిల్లీ కేపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బౌలింగ్‌లో, ఆ తరువాత బ్యాటింగ్‌లో చెలరేగింది. మ్యాచ్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్. 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఢిల్లీ కేపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపాడు. 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 16 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విజయ్ శంకర్-29 పరుగులతో రాణించడంతో 18.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది గుజరాత్. ఈ ఇన్నింగ్‌తో సాయి సుదర్శన్ హీరో అయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్ అతనిదే.

Tilak Varma and Sai Sudarsan

ఈ సీజన్‌లో భారత్‌కు చెందిన యంగ్ ప్లేయర్లు తమ తడాఖా చూపుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఏ రేంజ్‌లో ఆడుతున్నాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీకి చేరువ అయ్యాడు. హోమ్ పిచ్‌పై లక్నో సూపర్ జెయింట్స్‌పైనా చెలరేగాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌లల్లో 149 పరుగుల చేశాడు. ఇప్పటివరకు హయ్యెస్ట్ స్కోరర్ అతనే.

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఈ సీజన్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. రెండో మ్యాచ్‌లో 14 పరుగులే చేసినా అతని బ్యాటింగ్ స్కిల్స్‌ను తక్కువగా అంచనా వేయలేం. ముంబై ఇండియన్ మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ.. ఈ సీజన్‌లో కూడా శుభారంభం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి హిట్టర్లు విఫలమైన చోట తిలక్ వర్మ ఒక్కడే భారీ స్కోర్ చేయగలిగాడు.

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 37 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో బుల్లెట్ల వంటి తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ఆయుష్ బదోని ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో భారీ ఇన్నింగ్స్ లేనప్పటికీ- అతని దూకుడు ఎలాంటిదనేది గత సీజన్‌లోనే చూశాం. ఈ యంగ్ క్రికెటర్స్ అందరూ టీమిండియాలో ఫ్యూచర్ స్టార్స్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Wednesday, April 5, 2023, 9:33 [IST]
Other articles published on Apr 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+