
కొత్త హెడ్ కోచ్‌గా..
వెస్టిండీస్‌కు చెందిన లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న టామ్ మూడీ స్థానంలో లారాను తీసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు వ్యూహాత్మక సలహాదారుగా, బ్యాటింగ్ కోచ్‌గా పని చేశారు బ్రియాన్ లారా. ఆయన పేరును కోచ్ పదవికి ఖరారు చేసింది.

మూడీకి వీడ్కోలు..
హెడ్ కోచ్ టామ్ మూడీకి గుడ్‌బై చెప్పింది సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్. ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించకూడదని కావ్యా మారన్ నిర్ణయించారు. ఇకపై ఆయన తమ జట్టుతో కొనసాగబోరని తేల్చి చెప్పారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ పొడిగించవద్దంటూ టామ్ మూడీ సైతం సంకేతాలను పంపించిన కొన్ని గంటల్లోనే బ్రియన్ లారా అపాయింట్ అయ్యారు. ఇప్పటికే రెండు దఫాలుగా టామ్ మూడీ కాంట్రాక్ట్‌ను పొడిగించింది. మూడోసారి ఆ నిర్ణయం తీసుకోలేదు.
డెసర్ట్ వైపర్స్ డైరెక్టర్‌గా..
వచ్చే ఏడాది జనవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ20కి చెందిన డెసర్ట్ వైపర్స్ టీమ్ డైరెక్టర్‌గా టామ్ మూడీ అపాయింట్ అయ్యారు. ఆయనకు ఎస్‌ఆర్‌హెచ్ గుడ్‌బై చెప్పడానికి ఇదొక కారణంగా భావిస్తోన్నారు. ఐపీఎల్, ఐఎల్టీకి ఒకేసారి సేవలను అందించడంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో టామ్ మూడీకి వీడ్కోలు పలకాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావించింది. కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు.

మూడీ హయాంలోనే టైటిల్..
ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ రెండుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. ఆయన హయాంలో ఐపీఎల్ మొత్తంగా తొమ్మిది సీజన్లను ఎదుర్కొంది సన్‌రైజర్స్. అయిదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2016లో టైటిల్‌ను గెలుచుకుంది. గ్లోబల్ T20 కెనడాలో మాంట్రియల్ టైగర్స్‌కు సేవలందించాలనే ఉద్దేశంతో 2019లో సన్‌రైజర్స్‌కు దూరం అయ్యాడు. అప్పట్లో ఆయన స్థానాన్ని ట్రెవర్ బేలిస్ భర్తీ చేశారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.

గెలిచింది తొమ్మిదే..
సెకెండ్ ఫేస్‌లో టామ్ మూడీ హయాంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా రాణించలేదు. మొత్తంగా 28 మ్యాచ్‌లలో గెలిచింది తొమ్మిదే. 18 మ్యాచ్‌లల్లో ఓటమి పాలైంది. 2021, 2022 సీజన్లల్లో దారుణంగా విఫలమైంది. 2021లో మూడు విజయాలను మాత్రమే అందుకుంది సన్‌రైజర్స్. ఈ సీజన్‌లో ఆరింట్లో గెలిచింది. ఎనిమిదో స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications












