Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ షాట్స్ ఆడదలచుకోలేదు- సెంచరీ తరువాత విరాట్ కోహ్లీ

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చెలరేగింది. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్‌ను నిర్దేశించినప్పటికీ- అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవున్న నేపథ్యంలో- ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం లాంఛనప్రాయమే.

గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 186 పరుగుల చేయగా- ఆర్సీబీ బ్యాటర్లు ఈజీగా ఛేదించారు. పడేశారు. 19.2 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులతో సన్‌రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడారు.

 I dont play fancy shots and never look at my numbers, saysViratKohli

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. నాలుగు భారీ సిక్సర్లు, డజను ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ విశ్వరూపం ముందు- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్‌లో నమోదైన సెంచరీ వెలవెలబోయింది. హెన్రిచ్ క్లాసెన్- 51 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో చేసిన 104 పరుగులను జనం మరిచిపోయారు.

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడాడు. భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించాలనే లక్ష్యంతో క్రీజ్‌లోకి దిగామని, తొలి వికెట్ భాగస్వామ్యానికి 172 పరుగులు చేస్తామని ఊహించలేదని పేర్కొన్నాడు. తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగేలా పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నామని, దాన్ని అంతే పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేయగలిగామని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సెంచరీలు, నంబరింగ్ అనే విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని, జట్టును గెలిపించడంలో చివరి వరకు పోరాడాలనేదే తన ప్రయత్నమని పేర్కొన్నాడు. ఫ్యాన్సీ షాట్లను ఆడదలచుకోలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఏడాది పొడవునా మ్యాచ్‌లను ఆడాల్సి ఉండటం వల్ల ప్రతీసారీ ఫాన్సీ షాట్‌లు ఆడలేమని తేల్చి చెప్పాడు. త్వరగా అవుట్ కావడానికి ఫ్యాన్సీ షాట్లు ఒక కారణమౌతాయని పేర్కొన్నాడు. టెక్నిక్‌కు కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తానని వివరించాడు.

హైదరాబాద్‌లో ఆడుతోంటే తన హోమ్ పిచ్ మీద ఆడుతున్నట్టే ఉందని, ఇక్కడి ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరిస్తోన్నారని కోహ్లీ చెప్పాడు. సెంచరీ తరువాత హైదరాబాద్ ఆడియన్స్ ఇచ్చిన స్పందనను ఎప్పటికీ మరిచిపోలేనని కోహ్లీ పేర్కొన్నాడు. బెంగళూరు అభిమానులు తనను ఎంతగా ఆరాధిస్తారో.. హైదరాబాద్‌ అభిమానుల నుంచి కూడా తనకు అలాంటి అభిమానమే లభించడం ఆనందంగా ఉందని అన్నాడు.

Story first published: Friday, May 19, 2023, 7:35 [IST]
Other articles published on May 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+