Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ వచ్చాడు

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పరాజయాలు వీడట్లేదు. సొంత గ్రౌండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి చవి చూసింది. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన సన్‌రైజర్స్ మూడింట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది. ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌లను గెలవాల్సిన పరిస్థితిని క్రమంగా ఎదుర్కొంటోంది.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 14 పరుగుల తేడాతో ఓడింది సన్‌రైజర్స్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 64 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్ టాప్ స్కోరర్. హైదరాబాదీ తిలక్ వర్మ 37 పరుగులతో రాణించాడు.

 Rohit Sharma praised Arjun Tendulkar

192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి వరకూ పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. 19.5 ఓవర్లల్లో 178 పరుగుల వద్ద ఆ జట్టు ప్రస్థానం నిలిచిపోయింది. 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. కిందటి మ్యాచ్‌లో సెంచరీ బాదిన హ్యారీ బ్రూక్.. నిరాశ పరిచాడు. మయాంక్ అగర్వాల్- 48, హెన్రిక్ క్లాసెన్-36, కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్-22 పరుగులు చేశారు.

మిగిలిన బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నంత సేపూ మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ విజయం సాధిస్తుందనిపించేలా సాగింది అతని బ్యాటింగ్. 16 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 36 పరుగులు చేశాడు. 14వ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు.

పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతిని లాంగ్ ఆన్ వద్ద టిమ్ డేవిడ్ అందుకున్నాడు. ఆ వికెట్ పడటంతో మ్యాచ్ ముంబై ఇండియన్స్ వైపు మొగ్గింది. చివర్లో మార్కో జెన్‌సెన్ బౌండరీలు సాధించినా అది విజయాన్ని అందించలేకపోయింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

క్రీజ్‌లో ఉన్నది లోయర్ ఆర్డర్ బ్యాటర్లే కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంపై ఆశలు అడుగంటాయి. ఆ ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేశాడు అర్జున్ టెండుల్కర్. రెండు ఎక్స్‌ట్రాలతో కలిపి అయిదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయిదో బంతికి వికెట్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. ఐపీఎల్‌లో ఇది అతని తొలి వికెట్.

2.5 ఓవర్లే వేసిన అర్జున్ టెండుల్కర్.. 18 పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టాడు. అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ చేసిన తీరుపై కేప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. డెత్ ఓవర్లల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బంతులను సంధించగలిగాడని ప్రశంసించాడు. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నాడు. అర్జున్ టెండుల్కర్‌తో కలిసి ఆడటం ఎగ్జయిటింగ్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించాడు.

Story first published: Wednesday, April 19, 2023, 8:16 [IST]
Other articles published on Apr 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+