Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ లైఫ్ అండ్ డెత్ గేమ్‌: హైదరాబాద్‌లో వెదర్ రిపోర్ట్

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 200లకు పైగా టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకారాన్ని తీర్చుకుంది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఇంకో ఏడుబంతులు మిగిలివుండగానే కొట్టి పడేసింది. వరుసగా ముంబై ఇండియన్స్ సాధించిన రెండో గెలుపు ఇది. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది ముంబై. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది.

ఇవ్వాళ- సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమౌతోంది. తనతో పాటు వరుస పరాజయాలను చవి చూస్తోన్న కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న నేపథ్యంలో- ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నాయి ఈ రెండు జట్లు.

SRH vs KKR

చివరి అయిదు మ్యాచ్‌లల్లో రెండేసి చొప్పున విజయాలను సాధించాయి. పాయింట్ల పట్టికలో కోల్‌కత నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానంలో నిలవగా.. సన్‌రైజర్స్ ప్లేస్ తొమ్మిది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సి ఉంటుంది ఈ రెండు జట్లకూ.
తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని అందుకుంది. తన ప్రత్యర్థి ల్లీ కేపిటల్స్‌ను ఓడించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేయగా.. ఢిల్లీ కేపిట్స్ ప్రస్థానం 188 పరుగుల వద్దే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీపై గెలిచిన ఊపుతో కోల్‌కతను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది ఆరెంజ్ ఆర్మీ. కోల్‌కత నైట్‌రైడర్స్ పరిస్థితి దీనికేమీ భిన్నంగా లేదు. తన చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టికరిచింది. కోల్‌కత నిర్దేశించిన 179 పరుగులను గుజరాత్ అలవోకగా కొట్టేసింది.

ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే అవకాశాలు అంతంత మాత్రమే. కొద్దిరోజులుగా భారీ వర్షాలు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్నప్పటికీ- ఇవ్వాళ్టి మ్యాచ్‌కు తెరపినిస్తాయని వాతావరణం కేంద్రం అంచనా వేస్తోంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం పడటానికి 25 శాతం మాత్రమే అవకాశం ఉందని పేర్కొంది. తేలికపాటి జల్లులు లేదా ఓ మోస్తరు వర్షం పడినా మ్యాచ్ కొనసాగటానికే ఛాన్సెస్ ఉన్నాయి. భారీ వర్షం పడి- గ్రౌండ్ చిత్తడిగా మారితే తప్ప మ్యాచ్ రద్దుకాకపోవచ్చు.

సన్‌రైజర్స్ తుదిజట్టులో- మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అకిల్ హోసేన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఆడొచ్చు. కేకేఆర్‌లో జేసన్ రాయ్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జగదీశన్/మన్‌దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కేప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Thursday, May 4, 2023, 9:41 [IST]
Other articles published on May 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+