For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : ఐపీఎల్‌లో చెలరేగిన ప్లేయర్స్.. టాప్ పెర్ఫామెన్స్ చేసిన వాళ్లు వీళ్లే!

రెండు నెలలపాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ ముగిసింది. ఈ సీజన్‌లో తమ తమ జట్లను గెలిపించడానికి కొందరు ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. విరాట్ కోహ్లీ వంటి సూపర్ స్టార్లను పక్కన పెడితే.. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన ఐదుగురు ఆటగాళ్ల వివరాలు చూద్దామా?

యశస్వి జైస్వాల్: రాజస్థాన్‌కు దాదాపు ప్రతి మ్యాచులోనూ అద్భుతమైన ఆరంభం అందించిన ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఈ ఏడాది మొత్తం 16 మ్యాచులు ఆడిన అతను..163.61 స్ట్రైక్ రేటుతో 625 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డు కూడా సృష్టించాడీ కుర్ర ఓపెనర్. ముంబైపై అతను బాదిన భారీ శతకాన్ని ఇప్పుడప్పుడే ఫ్యాన్స్ ఎవరూ మర్చిపోలేరు.

ipl top performers

రింకూ సింగ్: ఈ ఏడాది ఐపీఎల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్ర బ్యాటర్ రింకూ సింగ్. కోల్‌కతా నైట్ రైడ్స్ ఫినిషర్‌గా రాణించిన అతను గుజరాత్‌పై చవరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత అతను క్రీజులో ఎప్పుడు కనిపించినా అభిమానుల మనసుల్లో ఇదే మెదిలింది. ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రింకూ సింగ్ 149.52 స్ట్రైక్ రేటు, 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు.

శుభ్‌మన్ గిల్: ఈ ఐపీఎల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆటగాడు శుభ్‌మన్ గిల్. భారత క్రికెట్‌లో తదుపరి స్టార్ అతనే అని అందరూ నమ్ముతున్నారు. ఇప్పటికే కొందరు అతన్ని 'బేబీ గోట్' అని పిలుస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మూడు సెంచరీలు బాదిన గిల్.. రెండో క్వాలిఫైయర్‌లో ముంబైపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచుల్లో ఏకంగా 890 పరుగులు చేసిన అతను.. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 800పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఫాఫ్ డుప్లెసిస్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారధి ఫాఫ్ డుప్లెసిస్ ఈ ఏడాది అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన అతను 56.15 సగటు, 153.68 స్ట్రైక్ రేటుతో 730 పరుగులు చేశాడు. అతను ఉన్న టాప్ ఫామ్ చూసిన సౌతాఫ్రికా సెలెక్టర్లు కూడా అతన్ని వెతుక్కుంటూ వచ్చారట. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో లేదంటే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌లో అతను ఆడటం గ్యారంటీగా కనిపిస్తోంది.

Mohit Sharma

మోహిత్ శర్మ: ఈ ఏడాది మహమ్మద్ షమీ పర్పుల్ క్యాప్ అందుకోవడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే గుజరాత్ నెట్ బౌలర్‌గా ఉన్న మోహిత్ శర్మ అద్భుతమైన పునరాగమనం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో 27 వికెట్లు తీసుకున్న అతను.. చెన్నైతో జరిగిన ఫైనల్‌లో గుజరాత్‌కు మరో ట్రోఫీ అందించినంత పని చేశాడు.

Story first published: Wednesday, May 31, 2023, 17:11 [IST]
Other articles published on May 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+