Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయాస్ అయ్యర్ వెన్నెముక గాయంపై తాజా అప్‌డేట్

కోల్‌కత: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఫుల్ టైమ్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నెముక గాయంపై తాజా అప్‌డేట్ వెలువడింది. బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న అతను ఈ ఐపీఎల్ సీజన్‌ను ఇప్పటికే మిస్ అయ్యాడు. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరం అయ్యాడు.

వెన్నెముక గాయానికి లండన్‌లో చికిత్స చేయించుకుంటోన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభం కావడానికి ముందే అతను లండన్‌కు వెళ్లిపోయాడు. అక్కడ వెన్నునొప్పికి ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన శస్త్రచికిత్స పూర్తయింది. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. హాస్పిటల్ బెడ్‌పై నుంచి థమ్సప్ సిగ్నల్ ఇస్తూ శ్రేయాస్ అయ్యర్ లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

Shreyas Iyer successfully undergoes back surgery in London

బ్యాక్ సర్జరీ ముగిసిన తరువాత కొద్దిసేపు నడిచినట్లు వార్తలొచ్చాయి. నడుస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తేలింది. మునుపట్లా పెయిన్ కూడా లేదని శ్రేయాస్ అయ్యర్‌కు సర్జరీ నిర్వహించిన డాక్టర్లను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ కథనం ప్రచురితమైంది. 28 సంవత్సరాల ఈ డాషింగ్ బ్యాటర్.. మూడు నెలల విరామం తీసుకున్న తరువాత పూర్తిస్థాయిలో క్రికెట్‌లో ఎంట్రీ ఇవ్వొచ్చని అంచనా వేసింది.

ఈ మూడు నెలల విశ్రాంతి తరువాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ క్యాంప్‌కు అటెండ్ కావాల్సి ఉంటుంది శ్రేయాస్ అయ్యర్‌కు. అక్కడ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించగలిగితే- ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరిగే ఐసీసీ ప్రపంచకప్ 2023 కోసం జట్టుకు అందుబాటులోకి రావడం ఖాయమౌతుంది.

కాగా- గాయం వల్లే సుదీర్ఘకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తోన్న టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా వేగంగా కోలుకుంటోన్నాడు. ప్రస్తుత అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ క్యాంప్‌లో ఉంటోన్నాడు. ఫిట్‌నెస్ సాధించలేకపోవడం వల్ల ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరమైన వియం తెలిసిందే. ముంబై ఇండియన్స్ తరఫున అతను ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

కాగా- శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో కోల్‌కత నైట్ రైడర్స్.. జట్టు తాత్కాలిక కేప్టెన్‌గా నితీష్ రాణాను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోవడంలో విఫలమౌతోందీ జట్టు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లను ఆడిన కోల్‌కత నైట్ రైడర్స్.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. వరుసగా చివరి మూడు మ్యాచ్‌లల్లోనూ ఓడిపోయింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది.

Story first published: Friday, April 21, 2023, 11:20 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+