Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్..!!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023లో ఢిల్లీ కేపిటల్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. శనివారం రాత్రి మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. నిన్నటివరకు విజయాల కోసం మొఖం వాచిన ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకోగలిగింది. పాయింట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. భారీ లక్ష్యాన్ని సైతం ఢిల్లీ బ్యాటర్లు అలవోకగా ఛేదించడం ఈ మ్యాచ్ ప్రత్యేకత.

మొన్నటివరకు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఢిల్లీ కేపిటల్స్ జూలు విధించిన నేపథ్యంలో- ఇక అందరి దృష్టీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పడింది. ఢిల్లీ కేపిటల్స్ తరహాలోనే ఈ జట్టు కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది. ఆర్సీబీపై సాధించిన విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి ఢిల్లీ కేపిటల్స్ చేరుకోగా.. ఆ ప్లేస్‌లో ఉన్న సన్‌రైజర్స్ ఇప్పుడు అట్టడుగున నిలిచింది.

Sunrisers Hyderabad

ఈ పరిస్థితుల మధ్య ఇవ్వాళ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమౌతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. సన్‌రైజర్స్ కంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి చాలా చాలా మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లల్లో అయిదింట్లో నెగ్గింది. 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

సన్‌రైజర్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో ఆరింట్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. రాజస్థాన్‌తో పోల్చుకుంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన అవసరం హైదరాబాద్‌కే ఉంది. ప్లేఆఫ్స్ చేరడానికి ఇదే చివరి అవకాశం కూడా. ఇందులో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా తుడిచిపెట్టుకుని పోయినట్టే అవుతుంది.

అలాంటి కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలా ఆడతారనేది ఆసక్తి రేపుతోంది. సెంచరీ తరువాత హ్యారీ బ్రూక్ మెరుపులు మాయం అయ్యాయి. అతని నుంచి భారీ ఇన్నింగ్ కాదు కదా.. పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోతోన్నాడు. ఈ మ్యాచ్‌లో అతణ్ని పక్కనపెట్టే అవకాశాలు లేకపోలేదు. హ్యారీ బ్రూక్‌కు బదులుగా న్యూజిలాండ్‌కు చెందిన డాషింగ్ వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్‌ను ఆడించవచ్చనే అంచనాలు ఉన్నాయి.

సన్‌రైజర్స్ తుదిజట్టులో- అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్/గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జెన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్‌లో- జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్/ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, 11 యుజ్వేంద్ర చాహల్ ఆడొచ్చు. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు. అదే జరిగితే దేవ్‌దత్ పడిక్కల్‌తో అతణ్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది.

Story first published: Sunday, May 7, 2023, 12:17 [IST]
Other articles published on May 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+