Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌ ఖూన్ మాఫ్: ఫలక్‌నుమా ఫిలిప్స్.. షేక్‌పేట్ సమద్: సన్‌రైజర్స్ ఓవర్‌ నైట్ స్టార్స్

జైపూర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చెలరేగింది. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్‌ను నిర్దేశించినప్పటికీ- అదరలేదు బెదరలేదు. చివరి బంతి వరకూ పోరాడి మరీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. సన్‌రైజర్స్ చేతిలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం సాధ్యమే.

ఆదివారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన రాజస్థాన్ రాయల్స్‌తో తలపడిన మ్యాచ్- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల తెగింపు ధోరణికి అద్దం పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 214 పరుగులు భారీ లక్ష్యాన్ని కొట్టి అవతల పడేశారు సన్‌రైజర్స్ బ్యాటర్లు. 217 పరుగులు చేశారు. చెప్పుకోదగ్గ హిట్టర్లు లేని జట్టుగా గుర్తింపు పొందిన ఆరెంజ్ ఆర్మీ- చివరి 12 బంతుల్లో ఏకంగా 41 పరుగులను సాధించడం అసాధారణమే.

Sunrisers

చివరి రెండు ఓవర్లల్లో 20కి పైగా రన్‌రేట్‌ను పరుగులు చేయాల్సి ఉన్న దశ నుంచి సన్‌రైజర్స్ మ్యాచ్‌ను కాపాడుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. 19వ ఓవర్‌లో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఉన్న మ్యాచ్‌ను ఉన్నఫళంగా లాగేసుకున్నాడు గ్లెన్ ఫిలిప్స్. ఈ సీజన్‌లో అతను ఆడిన తొలి మ్యాచ్ ఇదే. వరుసగా విఫలమౌతోన్న హ్యారీ బ్రూక్ స్థానంలో అతన్ని తుదిజట్టులోకి తీసుకుంది సన్‌రైజర్స్.

తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కుల్‌దీప్ యాదవ్ వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు ఫిలిప్స్. నాలుగో బంతి బుల్లెట్ వేగంతో బౌండరీ లైన్ దాటించాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో 24 పరుగులు రాబట్టుకుంది సన్‌రైజర్స్. ఫిలిప్స్ అవుట్ కావడం కొంత ఆందోళనకు గురి చేసినప్పటికీ.. ఆ ఊపును అబ్దుల్ సమద్ కొనసాగించాడు. గెలవడానికి చివరి ఓవర్‌లో కావాల్సిన 17 పరుగులను అబ్దుల్ సమద్ రాబట్టుకోగలిగాడు.

సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రెండు పరుగులొచ్చాయి. రెండో బంతిని సిక్స్‌గా మలిచాడు సమద్. మూడో బంతికి మళ్లీ రెండు పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరం కాగా అయిదో బంతికి సింగిల్ రన్ తీశాడు మార్కో జెన్‌సెన్. చివరి బంతిని సందీప్ శర్మ నో బాల్‌గా వేయడం మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. ఎక్స్‌ట్రాగా వచ్చిన ఆ బంతిని బౌలర్ తల మీదుగా లాంగాన్‌లో భారీ సిక్స్‌ బాదాడు.

ఐపీఎల్‌ చరిత్రలో థ్రిల్లర్‌గా మిగిలిపోయే మ్యాచ్ ఇది. అనూహ్యంగా లభించిన ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు పండగ చేసుకుంటోన్నారు. హీరోలుగా నిలిచిన గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్‌ను ఆకాశానికెత్తేస్తోన్నారు. ఫిలిప్స్, అబ్దుల్ సమద్‌కు లోకల్ పేర్లు పెట్టేశారు కూడా. ఫలక్‌నుమా ఫిలిప్స్, షేక్‌పేట్ సమద్‌గా వారికి నామకరణం చేశారు. టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Story first published: Monday, May 8, 2023, 8:14 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+